నాతో రొమాన్స్‌కు పూజా బేడీ కూతురే కరెక్ట్ : యంగ్ హీరో

by Jakkula Samataha |   ( Updated:2021-06-06 05:30:01.0  )
నాతో రొమాన్స్‌కు పూజా బేడీ కూతురే కరెక్ట్ : యంగ్ హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కిడ్స్ నెంబర్ వన్ ప్లేస్ కోసం పోటీపడుతూనే ఉన్నారు. యాక్టింగ్, బ్యూటీనెస్, ఫిట్‌నెస్ అన్నింటిలోనూ ఒకరిని మించి ఒకరు ఉండేందుకు ట్రై చేస్తుంటారు. అదే సమయంలో గ్రేట్ ఫ్రెండ్షిప్ బాండ్ కూడా మెయింటెన్ చేస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్, పూజా బేడీ కూతురు అలయా ఫర్నీచర్ వాలా. తాజాగా ఓ వర్చువల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్.. అలయాపై ప్రశంసల వర్షం కురిపించాడు.

లాస్ట్ ఇయర్ ‘జవానీ జానేమన్’ సినిమా ద్వారా ఎంట్రీతో క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ అందుకున్న అలయా చాలా హార్డ్ వర్క్ చేస్తుందని తెలిపాడు. రోజురోజుకు తనను తాను ఇంప్రూవ్ చేసుకునేందుకు, ఆర్ట్ విషయంలో అంత డెడికేషన్ చూపించిన ఈ జనరేషన్ గర్ల్‌ను ఎక్కడా చూడలేదన్నాడు. తన నుంచి ఏ సినిమా వచ్చినా సరే ఆడియన్స్‌ను కచ్ఛితంగా ఇంప్రెస్ చేస్తుందన్న హర్షవర్ధన్.. తనను చూసి గ్రేట్‌గా ఫీల్ అవుతున్నానని తెలిపాడు. అలయాతో వర్క్ చేసేందుకు వెయిట్ చేస్తున్నానని, తమ ఇద్దరి స్క్రీన్‌ కెమిస్ట్రీ ది బెస్ట్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

Advertisement

Next Story