- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం పదవి వద్దు.. పార్టీ పదవే ముద్దు
సీఎం పదవిపై తనకు వ్యామోహం లేదని రజినీకాంత్ అన్నారు. చెన్నైలోని లీలాప్యాలెస్ హోటల్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు. ‘‘ రెండేళ్ల కిందటే రాజకీయాల్లోకి వస్తానని చెప్పా. జయలిత మృతితో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. అప్పుడే రాజకీయల్లోకి రావాలని అనుకున్నా. అన్ని పార్టీలో 50 ఏళ్లు నిండిన వారే ఉన్నారు. యువతకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకే పదవులు వస్తున్నాయి. నా పార్టీలో 60 శాతంపైగా సీట్లు యువతకే ఇస్తా. రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్‌లను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తాను. అన్ని పార్టీల్లో సీఎంగా పార్టీ అధినేతలే ఉంటారు. నాకు సీఎం పదవిపై వ్యామోహం లేదు. పార్టీ అధినేతగా మాత్రమే ఉంటా. ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా బాగా చదువుకున్నవ్యక్తిని ప్రకటిస్తా’’ అని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై మీడియాకు తెలిపారు.
tag;rajinikanth, tamil super star, press meet