- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను కలలో కూడా ఊహించలేదు: సీపీ
దిశ, వరంగల్: లాక్ డౌన్ సమయంలో కరోనా కట్టడి కోసం పోలీసులు పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించారని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ అన్నారు. హన్మకొండ డివిజనల్ పోలీసుల అధ్వర్యంలో శనివారం కేయూ సమావేశ ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయన మాట్లాడుతూ మన జీవితకాలంలో ఇలాంటి అనుభవం ఎదురవుతదని నేను కలలోనైనా ఊహించ లేదన్నారు. ఈ కరోనా కట్టడి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, అందులో భాగంగానే మన దేశంలోనూ కరోనా కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్లు ప్రకటించాయని, కరోనా వ్యాప్తి చెందకుండా పోలీసులు తమ వంతు బాధ్యతగా ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రానీయకుండా కట్టడి చేయడంలో పూర్తిగా విజయం సాధించారన్నారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా పోలీస్ చెకింగ్ పాయింట్ల వద్ద విధులు నిర్వహించిన తీరు అభినందనీయమన్నారు. వరంగల్ అర్భన్ పరిధిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన క్రమంలో మహమ్మారి కట్టడే తమ అంతిమ లక్ష్యంగా భావించి తమ భద్రతను మరిచి పోలీసులు విధులు నిర్వహించడం పట్ల ప్రజల్లో గౌరవం పెరిగిందన్నారు. అదేవిధంగా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను చేరవేయడంలోనూ పోలీసులు పరోక్షంగా తమ సహాయాన్ని అందిచారని కొనియాడారు. ఇదే సమయంలో వలస కూలీలకు భోజన వసతి ఏర్పాట్లు కల్పించడం ద్వారా వారు సైతం పోలీసులు అందించిన సేవల పట్ల తమ వ్యక్తిగత కృతజ్ఞతలు తెలుపుకున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ సమయంలో సేవలందించిన అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ ఇన్ చార్జ్ డీసీపీ మల్లారెడ్డి, హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్లు డేవిడ్ రాజు, దయాకర్, ఆజయ్, సతీష్ కుమార్ తో పాటు సబ్-ఇన్స్ స్పెక్టర్లు పాల్గొన్నారు.