నేను మాత్రం సిండ్రెల్లా కాదు : అక్షయ్

by Jakkula Samataha |
నేను మాత్రం సిండ్రెల్లా కాదు : అక్షయ్
X

దిశ, సినిమా : కిలాడి అక్షయ్ కుమార్ ఎక్స్‌పరిమెంటల్ రోల్స్‌తో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో ‘బెల్‌బాటమ్’ చిత్రం థియేటర్‌లో రిలీజ్ కాబోతుండగా.. సినిమా హాళ్లలో మూవీ విడుదల చేసేందుకు ఇది సరైన సమయమని అభిప్రాయపడ్డాడు. పాండమిక్ టైమ్‌లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాల షూటింగ్‌లో పాల్గొనడంపై స్పందించిన అక్షయ్.. పోలీసులు, జర్నలిస్టులు వర్క్ చేసేందుకు బయటకు వెళ్తున్నప్పుడు మనం ఎందుకు సాహసం చేయకూడదని, కొవిడ్ మన జీవితాల్లో భాగమైపోయిందన్నాడు.

ఈ సందర్భంగా ‘బెల్‌బాటమ్’ షూటింగ్ కోసం స్కాట్లాండ్‌కు వెళ్తుండగా జరిగిన సంఘటన గుర్తుచేసుకున్నాడు అక్షయ్. 200 మంది పాసింజర్లతో ఉన్న ప్లేన్ టేకాఫ్ అయ్యేంత వరకు కూడా నమ్మకం లేదని, కరోనా కారణంగా వీసా క్యాన్సల్ చేస్తారని, యూటర్న్ తీసుకోమని చెబుతారని అనుకున్నారనే అనుమానంతోనే ఉన్నట్లు తెలిపాడు. కానీ ఒక్కసారి ఫ్లైట్ టేకాఫ్ కాగానే ఆనందంతో అందరూ అరిచారని, ఐదు నెలలు ఇంట్లోనే లాక్ చేయబడ్డాక బయటకు వెళ్తుండటంతో ఆనందంపట్టలేక అరిచేశారని చెప్పాడు. ఇక ‘బెల్‌బాటమ్’ తర్వాత అక్షయ్ సైకో థ్రిల్లర్ ఫిల్మ్ ‘సిండ్రెల్లా’ మూవీలో కనిపించనున్నాడు. అయితే తాను ఇందులో సిండ్రెల్లా కాదని, ఇప్పటి వరకు ఇది మాత్రమే చెప్పగలనని అన్నాడు.

Advertisement

Next Story