- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వికెట్ల వెనుక ధోనీని మిస్ అవుతున్నాను : కుల్దీప్ యాదవ్

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు అవకాశం ఇవ్వడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యానని.. తాను అంత ఘోరంగా బౌలింగ్ చేస్తున్నానా అని అనిపించి బాధపడ్డట్లు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత కొద్ది నెలలుగా కుల్దీప్ యాదవ్ టీమ్ ఇండియా బెంచ్‌కే పరిమితం అయ్యాడు. పలు పర్యటనలకు ఎంపిక అవుతున్నా.. తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. తాజాగా ఇంగ్లాండ్ సిరీస్‌కు కుల్దీప్ యాదవ్‌ను సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టారు. కాగా ఈ విషయంపై కుల్దీప్ స్పందించాడు.
“తనను కేకేఆర్ జట్టు తుది జట్టులో ఆడించకపోవడం కలచి వేసింది. నేను అంత ఘోరంగా ఆడుతున్నానా అని బాధేస్తున్నది. వికెట్ల వెనుక ధోనీ భాయ్‌ని మిస్సవుతున్నాను. అతడు వికెట్ల వెనుక ఉండి మాకు సలహాలు ఇచ్చేవాడు. ఇప్పుడు రిషబ్ ఉన్నాడు. కానీ అతడు మరింత అనుభవం సంపాదించాల్సి ఉన్నది. మరోవైపు ప్రతీ బౌలర్‌కు మరో ఎండ్‌లో మంచి భాగస్వామి ఉండాలి. ధోనీ రిటైర్ అయ్యాక నేను, చాహల్ కలసి ఆడలేదు. అది కూడా ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నది” అని కుల్దీప్ అన్నాడు.