‘అలా అయితేనే మెట్రో ఎక్కండి’

దిశ, వెబ్‌డెస్క్: కరోనా లక్షణాలు లేకుంటేనే మెట్రో రైలులో ప్రయాణం చేయాలని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సోమవారం నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. శనివారం మెట్రో రైలు పునర్ ప్రారంభం పై ఆయన మాట్లాడుతూ.. విధుల్లో ఉండే సిబ్బందికి సైతం పీపీఈ కిట్లు అందజేస్తామన్నారు. నగదు రహితంగా, స్మార్టు కార్డుల ద్వారానే టికెట్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

మెట్రో ప్రయాణికులు తప్పని సరిగా భౌతికదూరం, మాస్క్ ధరించేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయించడమే కాకుండా.. స్టేషన్లలో ఐసోలేషన్ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీంతో పాటు ప్రయాణికులు సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటేనే మెట్రో సేవలను ఎంచుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు అందరూ నడుచుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Advertisement