- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు, నాలుగు రోజుల్లో తేలికపాటి వర్షాలు!
దిశ, వెబ్ డెస్క్: రాబోయే మూడు నాలుగు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం సోమవారం తెలిపారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా 1.5 కిలోమీటర్ల నుంచి 3.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. మరొక ఉపరితల ఆవర్తనం మరాట్వాడా ప్రాంతంలో 3.1 కి.మీ లో కేంద్రీకృతమైందని, ద్రోణి ఒకటి మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు కొనసాగుతోందని నాగరత్నం వెల్లడించారు. అయితే షీర్ జోన్ బలహీనపడిందని దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని సూచించారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందన్నారు. అటు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి, జనగాం, నల్గొండ, జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలం ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.