- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికే హెల్త్‌హబ్‌గా హైదరాబాద్ : ఈటల
by Shyam |
X
దిశ, రాజేంద్రనగర్: దేశానికే హెల్త్‌హబ్‌గా హైదరాబాద్ మారిందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం శంషాబాద్‌లో ప్లూటస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి అనేకమంది పేషెంట్లు చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని, ఇక్కడ అతి తక్కువ ధరలో వైద్యం అందిస్తున్నారని తెలిపారు. శంషాబాద్ పట్టణం తక్కువ సమయంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, అలాంటి ప్రాంతలో తన మిత్రులు డాక్టర్ వేణుగోపాల్, శ్రీకాంత్, శివ కాంత్ బృందం హాస్పిటల్ ప్రారంభించి వైద్యసేవలు అందించే ప్రయత్నం చేయడం ఆనందంగా ఉందన్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అరకులో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారన్నారు.
Advertisement
Next Story