నాకు కొంతమంది అడ్డుపడుతున్నారు : అజారుద్దీన్

by Shyam |
నాకు కొంతమంది అడ్డుపడుతున్నారు : అజారుద్దీన్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 13 మంది కీలక సభ్యులు పాల్గొన్నారు. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ దీపక్‌వర్మ నియామకం అయ్యారు. అంబుడ్స్‌మన్ నియామకం విషయంలో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, విజయానంద్‌ల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రౌండ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొంతమంది నేను ఏం చేసినా అడ్డుపడాలని చూస్తున్నట్టు వెల్లడించారు. హెచ్‌సీఏలో గొడవలపై బీసీసీఐ సీరియస్‌గా ఉందని గుర్తుచేశారు. ఏజీఎంలో గొడవ చేసిన వారికి షోకాజు నోటీసులు ఇవ్వడంతో పాటు.. అవసరమైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story