సిటీలో రోడ్డెక్కిన బస్సులు..!

by  |
సిటీలో రోడ్డెక్కిన బస్సులు..!
X

దిశ, వెబ్‎డెస్క్: కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలపాటు డిపోలకే పరిమితమైన హైదరాబాద్ సిటీ బస్సులు.. శుక్రవారం ఉదయం నుంచి రోడ్డెక్కాయి. రాష్ట్రంలో ఇప్పటికే జిల్లా సర్వీసులు తిరుగుతుండగా నేటి నుంచి నగరంలో సర్వీసులు ప్రారంభమయ్యాయి. పూర్తి జాగ్రత్తలు, కొవిడ్ నిబంధన మధ్య బస్సు సర్వీసులు నడవనున్నాయి.

ప్రధానంగా పటాన్‌చెరు–చార్మినార్, పటాన్‌చెరు–హయత్‌నగర్, ఉప్పల్‌–లింగంపల్లి, గచ్చిబౌలి–దిల్‌సుఖ్‌నగర్‌తోపాటు చార్మినార్, జూపార్కు, ఎల్‌బీనగర్, చింతల్, బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రతి డిపో నుంచి 25 శాతం బస్సు సర్వీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో నేడు సిటీలో మొత్తం 625 బస్సులు నడవనున్నాయి.


Next Story

Most Viewed