- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా ఓటమికి కారణం ఆ గుర్తులే.. సాకులు వెతుక్కుంటోన్న పార్టీలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్కంఠగా కొనసాగుతోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 2958 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. నెక్ టు నెక్ సాగుతున్న కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకవేళ తక్కువ ఓట్లతో ఓడిపోతే చేయాల్సిన ప్రకటనలపై ఇప్పటినుంచే చర్చించుకుంటున్నారు. అయితే, ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు రొట్టెకోల గుర్తు మా కొంప ముంచిందని అనడానికి సిద్ధమై పలు న్యూస్ ఛానళ్లలో ఇంటర్వ్యూల్లో చెప్పేస్తున్నారు. ఇక మేమూ తక్కువ కాదంటున్నారు బీజేపీ పార్టీ నేతలు.
టీఆర్ఎస్ రొట్టెకోల గుర్తుపై విమర్శలకు దిగితే, బీజేపీ నేతలు డైమండ్ గుర్తుపై పడ్డారు. ఎందుకంటే డైమండ్ గుర్తుకు 110కి పైగా ఓట్లు పోల్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఇలా పార్టీ నేతలు సాకులు వెతుక్కుంటున్నారు.
తొలి రౌండ్లో కమలం పువ్వు గుర్తును పోలిన వజ్రం గుర్తు కి 113 ఓట్లు
పువ్వును ముంచనున్న వజ్రం..??#Huzurabad #HuzurabadByPollResults #HuzurabadElection #HuzurabadByElections
— Share Telangana (@ShareTelangana) November 2, 2021