నేడే హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

by Sridhar Babu |   ( Updated:2021-11-01 22:55:03.0  )
Huzurabad by-election
X

దిశ, కరీంనగర్ సీటీ: తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తం నేడు హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ వైపు చూస్తున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నిక ఫలితాలపై బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి.

ఈ ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని SRR డిగ్రీ కళాశాలలో జరుగనుంది. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదటగా హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగ్గా, ఒక్కో రౌండ్‌లో 9 వేల నుంచి 10 వేల ఓట్ల లెక్కిస్తారు. అంతేగాకుండా.. ఒక్కో రౌండ్ లెక్కింపు దాదాపు 30 నిమిషాల పాటు జరుగనుంది. మొత్తం హుజురాబాద్‌ ఉప ఎన్నికలో 2 లక్షల 5 వేల 236 ఓట్లు పోల్ అయ్యాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా.. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు.

Advertisement

Next Story