విరాట్ కోహ్లీ సరైనోడే : నాసిర్

by Shyam |
విరాట్ కోహ్లీ సరైనోడే : నాసిర్
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా కెప్టెన్‌ కోహ్లీని ఒకటి, రెండు ఫార్మాట్లకు మాత్రమే కెప్టెన్సీ అప్పగించాలని గతంలో మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాడు. మిగతా దేశాల క్రికెట్ జట్ల లాగ.. టీమిండియాకు వేర్వేరు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లను చూడలేమని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వలేవని స్పష్టం చేశాడు. అయినా.. విరాట్ కోహ్లీ భారత జట్టును అన్ని ఫార్మాట్లలో సమర్థవంతంగా నడిపించగలడని చెప్పుకొచ్చాడు. కోహ్లీ గంభీరమైన వ్యక్తి అని.. అతని వ్యక్తిత్వం కెప్టెన్సీలో కనిపిస్తుందన్నాడు. అంతేకాకుండా.. ఒక జట్టుకు వేర్వేరు కోచ్‌లు ఉండటం కూడా సరైన నిర్ణయం కాదని అన్నాడు. ఇటీవల పలువురు సీనియర్ క్రికెటర్లు ఇండియాకు ఒక్కో ఫార్మాట్‌కు.. ఒక్కో కోచ్ ఉండాలన్న అభిప్రాయాలను కూడా నాసిర్ హుస్సేట్ కొట్టిపారేశాడు. ఒక జట్టు ఏ ఫార్మాట్‌లో ఆడినా.. కెప్టెన్, కోచ్ ఒక్కరు ఉంటేనే ఆ జట్టు విజయవంతం అవుతుందని నాసిర్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed