వాగులో చిక్కుకున్న దంపతులు..!

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్:

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి మహబూబ్‎నగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో డిండి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే దుందుభి వాగులో దంపతులు చిక్కుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అచ్చంపేట సిద్ధపూర్ గ్రామానికి చెందిన సభవత్, వెంకట్ రాములు.. వాగులో చిక్కుకున్నట్లు గుర్తించారు. దీంతో వారిని కాపాడేందుకు జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు. వారి విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గువ్వల బలరాజ్ సీఎం కేసీఆర్‎కు వివరించి హెలికాప్టర్‎ను పంపాలని కోరారు.

Advertisement