- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరు నెలల క్రితమే పెళ్లి.. భార్య చెప్పిన విషయంతో షాక్‌లో భర్త.. ఏం జరిగిదంటే.?
దిశ, వెబ్‌డెస్క్ : వారికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినప్పటికీ వారిద్దరి మధ్య దాంపత్య జీవితం మాత్రం ఏమంత సంతోషంగా లేదు. భార్యను ఏమైంది అని విషయం అడగ్గా.. ఆమె మరో వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తెలిసి అతడి గుండె బద్దలైంది. దీంతో భర్త బాగా ఆలోచించి.. అతడే పెళ్లి పెద్ద అయి.. ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.
ఈ ఇంట్రెస్టింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూరుకు చెందిన కోమల్-పంకజ్‌కు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లి జరిగిన నాటి నుంచి భార్య ముఖంలో సంతోషం లేకపోవడాన్ని భర్త పంకజ్ గమనించాడు. దీంతో సమస్య ఏంటి అని భార్యను నిలదీశాడు. ఈ క్రమంలో నువ్వు సంతోషంగా ఉంటనే కుటుంబం ఆనందంగా ఉంటుందని బదులులిచ్చాడు. దీంతో భర్త మాటలు విశ్వసించిన ఆమె తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. తాను పింటు అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడు లేని జీవితం వృధా అని ఆవేదన వ్యక్తం చేసింది. తమ ప్రేమ విషయం తెలిసి కూడా తనకు కుటుంబ సభ్యులు బలవంతంగా పెళ్లి చేశారని కన్నీరు పెట్టుకుంది.
భార్య చెప్పింది విన్న పంకజ్.. ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబాలతో మాట్లాడి వారికి నచ్చజెప్పాడు. అనంతరం పింటూతో మాట్లాడి వివాహానికి ఏర్పాట్లు చేశాడు. అంతకంటే ముందు అనంతరం భార్యకు విడాకులు ఇచ్చాడు. వివాహ వేడుకకు అతడే పెళ్లి పెద్దగా ఉండి వారి పెళ్లిని ఘనంగా జరిపించాడు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వైరల్‌గా మారింది.
నన్ను చాలామంది అలా చేశారు.. మూవీ ఆర్టిస్ట్ సన