- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం: ప్రేమ, పెళ్లి.. భార్య ఆ పనికి ఒప్పుకోలేదని అది కోసేసిన భర్త
దిశ, వెబ్‌డెస్క్: ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు ఆ జంట.. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని జీవితాన్ని సంతోషంగా జీవించాలనుకుంది. కానీ, పెళ్లి చేసుకున్నాకనే భర్త నిజస్వరూపం బయటపడింది. అదనపు కట్నం కోసం భర్త వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు కాస్తా బెదిరింపులుగా మారాయి. చివరికి ప్రాణంగా ప్రేమించిన భర్తే.. తనపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించడంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. ఓ యువకుడు అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే.. ముంబైలో నివసించే హసీ (22), జూబ్లీహిల్స్ లోని వెంకటగిరికి చెందిన రవి నాయక్ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. ఇటీవలే హాసీ ని పెళ్లిచేసుకున్న రవి, హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. ఇక హాసీ బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా రవినాయక్ ఖాళీగా ఉండేవాడు. కొన్ని రోజులు సవ్యంగా సాగిన వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి. రవి నాయక్, భార్యను అదనపు కట్నంకోసం వేధించడం మొదలుపెట్టాడు. పుట్టింటికి వెళ్లి రూ. 50 వేలు తీసుకురావాలంటూ హింసించేవాడు. అందుకు భార్య ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీన డబ్బు విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన రవి నాయక్ భార్యను తీవ్రంగా కొట్టి, ఇంట్లో ఉన్న కత్తితో భార్య వేలు కోసి పరారయ్యాడు. మరుసటి రోజు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.