- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను కత్తితో పొడిచి తానూ పొడుచుకున్న భర్త
దిశ, బంజారాహిల్స్: భార్యను కత్తితో పొడిచి అనంతరం తానూ పొడుచుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన సత్తమ్మ అలియాస్ పుణ్యమ్మ(50), ఆమె భర్త మానయ్య మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు ఇటీవల తీవ్రం కావడంతో రెండు నెలల క్రితం సత్తమ్మ బంజారాహిల్స్‌లోని మిథిలానగర్‌లో నివసించే సోదరుడి ఇంటికి వచ్చింది. అనంతరం రెండ్రోజుల తర్వాత మానయ్య కూడా అక్కడికి వచ్చాడు. అదే సమయంలో భార్యను ఆ ఇంట్లో చూసి కోపం పట్టలేక ఆమె మంగళసూత్రాన్ని తెంపేసి అక్కడే ఉన్న కత్తితో మూడు చోట్ల పొడిచాడు. ఆమెను కాపాడేందుకు మరదలు కళావతితో పాటు చుట్టుపక్కల వారు ప్రయత్నిస్తుండగానే అదే కత్తితో తాను కూడా పొడుచుకున్నాడు. దీంతో ఇరువురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. సత్తమ్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.