భార్య కాపురానికి రావాలని భర్త మౌనపోరాటం

by  |
భార్య కాపురానికి రావాలని భర్త మౌనపోరాటం
X

దిశ, వెబ్‌డెస్క్ :
చాలా సందర్భాల్లో తన భర్త తనను కాదన్నాడని, అధిక కట్నం డిమాండ్ చేశాడని, అత్తింటి వారు టార్చర్ చేస్తున్నారని భార్యే అత్తింటి ఎదుట నిరసన చేయడం చూసుంటాం. కానీ మంచిర్యాలలో దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. తన భార్యను తనతో పంపించాలంటూ అత్తింటి ఎదుట ఒరుగంటి రాంకరన్ అనే యువకుడు మౌన పోరాటానికి దిగాడు. ఐదేండ్ల కిందట పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న తమ వైవాహిక జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని తానేప్పుడు అనుకోలేదని రాంకరన్ ఆవేదనవ్యక్తంచేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. లేఖాశర్మ అనే యువతిని 2014 ఆగస్టు 23వ తేదీన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని సీతారాముల ఆలయంలో పెద్దలను ఎదిరించి రాంకరన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఐదేళ్లుగా వీరు అన్యోన్యంగా ఉంటున్నారు. ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల తన భార్యను పుట్టింటికీ పంపించాడు. అదే నేరమయ్యింది. ఇంటికి వెళ్లిన కొద్ది రోజులకే తనతో కాపురం చేయడం ఇష్టం లేదని, తనకు విడాకులు కావాలంటూ భార్య లేఖాశర్మ కోర్టులో కేసు వేసింది.

ఇదిలాఉండగా, భార్యను ఎప్పటి నుంచో కాపురానికి రమ్మని ప్రాధేయపడుతున్నా రావడం లేదని రాంకరన్‌ వాపోయాడు. కనీసం కోర్టులో అయినా తనకు న్యాయం జరుగుతుందనే ఆశ ఉందని భావించాడు. ప్రస్తుతం కరోనా వల్ల కోర్టులు మూసివేయడంతో ఏంచేయాలో తెలియక అత్తింటి ఎదుట మౌన పోరాటానికి దిగాడు. తన భార్యను తనతో ఇచ్చి పంపించేదాక ఎక్కడికి కదిలేది లేదని రాంకకరన్ చెబుతున్నాడు.


Next Story