- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ చైర్ పర్సన్ భర్త హల్‌చల్.. యథేచ్చగా అధికార దుర్వినియోగం
దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీలో అధికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతున్నది. షాడో చైర్ పర్సన్ తీరు పగ్గాల్లేకుండా మితిమీరినట్లు సుస్పష్టమైంది. అధికారం ఇంట్లో ఉంటే ఏం చేసినా చెల్లుతుందనడానికి ఇది అద్దం పడుతోంది. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా మారి విమర్శల పాలవుతున్న అధికార పార్టీ నాయకుల పెత్తనం రోజురోజుకూ మితిమీరినట్లు తేటతెల్లం అవుతోంది. ఇందుకు సాక్ష్యాలు ఆర్మూరులో సోమవారం ‘దిశ’ విలేకరి కంట పడిన దృశ్యాలు నిరూపించాయి.
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక సంఘం చైర్ పర్సన్‌గా పండిత్ వినీత పదవిలో కొనసాగుతున్నారు. అయితే, ఆమె భర్త పండిత్ పవన్ తన భార్యను ఇంటికే పరిమితం చేసి, చైర్మన్‌గా అధికారం చెలాయిస్తున్నారు. పట్టణంలో చోటుచేసుకునే పలు సివిల్ పంచాయితీల్లో చైర్ పర్సన్ భర్తే తలదూరుస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పంచాయితీల కోసం తనకు ఎలాంటి సంబంధం లేని మున్సిపల్ కార్యాలయాన్ని రచ్చబండగా మార్చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. ఏకంగా చాంబర్‌లోని చైర్ పర్సన్ కుర్చీని ఓ మూలకు నెట్టేసి ఆ స్థానంలో మరో చైర్ వేసుకొని కూర్చోవడాన్ని స్థానికంగా పలువురు విమర్శలు చేస్తున్నారు. సోమవారం చైర్ పర్సన్ చాంబర్‌లో పండిత్ పవన్, తన అనుచరులు, పలువురు కౌన్సిలర్లతో గంటల కొద్దీ కూర్చొని టీ, కాఫీలు తాగుతూ ముచ్చట్లు సాగించడం, ఫోన్‌లో మాట్లాడుతూ.. ఆ చాంబర్ గడపటం వివాదాస్పదం అవుతోంది.
దర్జాగా ప్రభుత్వ వాహన వినియోగం
ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్ అధికారిక వాహనంలో ఆమె భర్త పవన్ దర్జాగా తిరుగుతున్నారు. అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం కొందరు ప్రజాప్రతినిధులకు వాహన అలవెన్సులు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆర్మూర్ చైర్ పర్సన్ ఓ ఇన్నోవా కారును వినియోగిస్తున్నారు. ప్రతీనెలా ప్రభుత్వం వాహన అలవెన్సులు చెల్లిస్తున్న నేపథ్యంలో ఆ వాహనాన్ని ఇతరులు వాడకూడదన్న నిబంధనలు ఉన్నా.. పండిత్ పవన్ ఆ నిబంధనలు పాతరేసినట్లు తెలుస్తోంది. చైర్ పర్సన్ హోదాలో తన భార్య వినీత వినియోగించాల్సిన వాహనంలో పవన్ మున్సిపల్ ఆఫీసుకు చేరుకోవడం ‘దిశ’ విలేకరి కంటపడింది. చైర్ పర్సన్ చాంబర్‌లో తన పనులు చేసుకొని అధికారిక వాహనంలో వెళ్తున్న దృశ్యాలు ‘దిశ’ ఫోన్ కెమెరాలో రికార్డయ్యాయి.