- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నానం చేసి దాని కోసం ఎదురుచూస్తున్న భర్త.. కొద్దిసేపు ఆగాలన్నందుకు భార్య దారుణ హత్య
దిశ, వెబ్‌డెస్క్ : స్నానం చేసిన తర్వాత టవల్ తీసుకురావడంతో ఆలస్యం చేసిందనే కోపంతో భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. అటవీ శాఖ దినసరి వేతన ఉద్యోగిగా పని చేస్తున్న రాజ్ కుమార్ బహే స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వాలని అతని భార్య పుష్పాబాయిని (45) అడిగాడు.
ఆమె ఇంట్లో పాత్రలు తోముతున్నానని కొంత సేపు ఆగాలని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ గడ్డ పారతో భార్య తలపై పలుమార్లు బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమయంలో తండ్రిని అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా తనను బెదిరించాడని కూతురు పోలీసులకు వివరించింది. బాధిత కూతురి ఫిర్యాదు మేరకు నిందితుడిని ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.