- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేరే మహిళతో భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
దిశ, వెబ్‌డెస్క్ : భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆగ్రహంతో భర్తను చితకబాది పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన కుత్బుల్లాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఏడేళ్ల క్రితం అనిల్‌కు రామేశ్వరితో పెళ్లి జరిగింది. వీరికి ఓ బాబు కూడా ఉండటం గమనార్హం.
ఇదిలా ఉండగా వివాహమైన నాటి నుంచి అనిల్ అదనపు కట్నం కోసం రామేశ్వరిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య చాలా గొడవ జరిగినట్టు తెలిసింది. అదనపు కట్నం ఇవ్వకపోతే రామేశ్వరి పేరుతో ఉన్న ఫ్లాట్‌ను అమ్మాలని ఆమెపై అనిల్ ఒత్తిడి తెచ్చాడు. కానీ, రామేశ్వరి ఫ్లాట్ అమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
ఈ క్రమంలో కొద్ది నెలల నుంచి అనిల్ ప్రవర్తనలో మార్పును గమనించిన భార్య.. అతనిపై ఫోకస్ పెంచింది. కుత్బుల్లాపూర్బ్యాంక్ కాలనీలో రెండేళ్లుగా వేరే మహిళతో నివాసం ఉంటున్నట్టు తెలుసుకుంది. దీంతో షాకైన రామేశ్వరి.. అనిల్ విషయం బయటపెట్టాలనుకుంది. శనివారం ఉదయం వారిద్దరు ఇంట్లో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనిల్‌ను చితకబాది పోలీసులకు అప్పగించింది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.