భార్య వేదింపులకు భర్త ఆత్మహత్య..

by Sumithra |   ( Updated:2021-09-30 08:54:19.0  )
suidaide
X

దిశ,కంటోన్మెంట్ ; చిట్టీ డబ్బులు భార్యభర్తల మధ్య గొడవకు దారితీసింది. మనస్థాపానికి గురైన భర్త ఊరేసుకొని ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, మానేపల్లి గ్రామానికి చెందిన సుంకె నర్సింహులు, మంజులకు ఇద్దరు పిల్లలు. గత ఆరేళ్లుగా న్యూ బోయిన్ పల్లి, బాపూజీనగర్ లో నర్సింహులు కుటంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కాగా నర్సింహులు మేస్త్రీ పనిచేస్తుండగా, మంజుల ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత వారం రోజుల క్రితం చిట్టి ఎత్తుకున్న నర్సింహులు మద్యం సేవిస్తూ మూడు రోజులుగా పనికి వెళ్లడంలేదు. ఈ విషయమై దంపతుల నడుమ గొడవ జరిగింది.

రోజులాగే గురువారం ఉదయం 6 గంటల సమయంలో మంజుల పనికి వెళ్లే క్రమంలో తానుకూడా పనికి వెళ్తున్నట్లు నర్సింహులు ఆమె తో చెప్పాడు. ఉదయం 10 గంటల సమయంలో స్థానికులు మంజులకు ఫోన్ చేసి ఇంటి బయట పిల్లలు రోధిస్తున్నారని, తలుపుకు లోపలి నుంచి గడియ పెట్టి ఉందని చెప్పారు. హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకొని స్థానికుల సహాయంతో తలుపులను బద్దలు కొట్టి చూసేసరికి నర్సింహులు చీరతో ఫ్యాన్ కు ఊరి వేసుకొని కనిపించాడు. మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఊస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story