- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యను గొడ్డలితో నరికి చంపేసిన భర్తకు రిమాండ్
దిశ, మక్తల్: తాగిన మైకంలో భార్యను హత్యచేసిన నస్లాయి రాములపై కేసునమోదు చేసి రిమాండుకు పంపినట్లు మక్తల్ ఎస్సై రాములు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చంద్రపూర్ గ్రామానికి చెందిన రాములు ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న తన భార్య సత్యమ్మను గోడ్డలితో నరికి చంపాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. తానే కోపంతో ఆత్మహత్య చేసినట్లు పొలీసుల ముందు నేరం అంగీకరించాడు. తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడం, తనకు మర్యాద కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపంతో చంపేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు నారాయణ పేట కోర్టులో హజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
తెల్లవారుజామున మత్తు దిగిన తర్వాత తాను చేసిన తప్పును తెలుసుకున్న రాములు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటి వెనుక ఉన్న పొలంలో చెట్టుకు ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. పక్కపోలంలో దుక్కి దున్నుతున్న బంధువులు గమనించి అడ్డుపడ్డారు. తన భార్యను గొడ్డలితో నరికి చంపానని, అందుకే అత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించానని బంధువులకు తెలిపాడు. దీనిపై బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నస్లాయి రాముని అదుపులోకి తీసుకున్నారు.