భార్య కోరిక తీర్చలేక భర్త ఆత్మహత్య

by Anukaran |   ( Updated:2020-07-10 05:33:17.0  )
భార్య కోరిక తీర్చలేక భర్త ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అని వ్యాపారం సరిగ్గా నడువక అవస్థలు పడుతున్నారు. కొందరైతే ఆ పని ఈ పని అని చూడకుండా దొరికిన పని చేసుకుంటున్నారు. అయితే, ఆటో డ్రైవర్ల పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా మారాయి. కనీస అవసరాలకు కూడా డబ్బు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆటో డ్రైవర్ తన కూతురుకు ఓణీల వేడుక చేయాల్సి వచ్చింది. ఫంక్షన్ చేయాలని అతని భార్య పట్టుబట్టింది. తన దగ్గర డబ్బులు లేవని, ఈ సమయంలో ఎవరూ అప్పు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. దీంతో కూతురి వేడుకను చేయలేకపోతున్నాననిమనస్తాపానికి గురై అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళి స్మశాన వాటికలోని ఓ చెట్టుకు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి ప్రాంతం తుమ్మలగుంటలో చోటుచేసుకుంది.

Advertisement

Next Story