ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మానవత్వం

by Sridhar Babu |
Gattikal
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఆత్మకూర్(ఎస్) మండల కార్యదర్శి నారగాని లింగయ్య, గట్టికల్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోన అయోధ్య అన్నారు. గట్టికల్ గ్రామంలో పార్టీలోని ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా మానవత్వంతో ఆదుకోవడానికి ముందుంటామని వారు పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా గట్టికల్‌లో ఇటీవల మృతిచెందిన పెరుమాళ్ల లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ గ్రామ కమిటీ తరుఫున సేకరించిన రూ.23,500లను ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు.

రాజకీయలు చేయడమే ముఖ్యం కాదని.. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించమే ప్రధానం అన్నారు. ఇప్పటి నుంచి ఇదే విధంగా అందరికీ సహాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ మాజీ అధ్యక్షుడు కోన రాజశేఖర్, రాములు, సంధ్యాల వెంకన్న, గోరెంట్ల సందీప్, యువజన నాయకులు, వార్డుమెంబెర్స్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed