‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరు మారింది

by  |
‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరు మారింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ జాతి వివక్షపై జరుగుతున్న చర్చలను గమనించి సంస్థ ప్రధాన ఉత్పత్తి ఫెయిర్ అండ్ లవ్లీ పేరులో ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా తొలగించిన పేరుకు బదులుగా కొత్త పేరును గురువారం ప్రకటించింది. ఇకనుంచి ఫెయిర్ అనే పదం బదులుగా ‘గ్లో’ అనే పదాన్ని జత చేస్తున్నట్టు, ‘గ్లో అండ్ లవ్లీ’ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్టు కంపెనీ వెల్లడించింది. గ్లో అండ్ లవ్లీ బ్రాండ్‌ను ముందుకు తీసుకెళ్తామని హెచ్‌యుఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా అన్నారు. కాగా, ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్‌ను 1975లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి మొన్నటిదాకా ఈ పేరు చాలా ప్రాచుర్యం పొందింది. ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ 2012లో భారత మార్కెట్లో 80 శాతం వాటా దక్కించుకునే స్థాయికి ఎదిగింది. ఇటీవల జాతివివక్ష నేపథ్యంలో 45 ఏళ్ల తర్వాత తొలిసారిగా పేరులో మార్పులు చేసింది. పేరుతో పాటు ప్రకటనల్లో ఉపయోగిస్తున్న రెండు ముఖాల్లో నల్లగా ఉన్న ముఖాన్ని తొలగించింది. దీని స్థానంలో అన్ని రకాల రంగుల ముఖాలను ప్రచారంలో ఉపయోగించనున్నట్టు కంపెనీ పేర్కొంది.


Next Story

Most Viewed