- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మరో షాక్
దిశ ప్రతినిధి, మెదక్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మరో షాక్ తగిలింది. ఇదివరకే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన సమయంలో గ్రామస్తులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం రోజున కూడా మరో నిరసన సెగ తగిలింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోవడం లేదని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమ ప్రాంతాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తావంటూ ఆకునూరు పరిరక్షణ సమితి, ఏఐఎస్ఎఫ్ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిలదీశారు.
ఆకునూరు గ్రామం పరిస్థితి పేరు పెద్ద.. ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని, పూర్వం నుంచి ఉన్నటువంటి హోమియోపతి ప్రభుత్వ ఆసుపత్రిని అక్రమంగా చేర్యాలకు తరలించారని, పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కూడా ఎత్తి వేశారని తిరిగి వాటిని యథావిధిగా ఆకునూరులో కొనసాగించాలన్నారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేసి గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పుల్లని వేణు, పరిరక్షణ సమితి అధ్యక్షులు సందబోయిన వెంకటేశ్‌లు డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి వెనుదిరిగారు.