- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్లీనరీని తలపించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం.. ఎక్కడో తెలుసా..?
దిశ, జల్పల్లి : బడంగ్‌పేట్ పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్లీనరీని తలపించింది. ఎక్కడ చూసినా కటౌట్లు.. ఫ్లెక్సీలు, జెండాలతో బడంగ్‌పేట్ గులాబీమయమైంది. బడంగ్‌పేట్ మున్సిపాలిటీ కమాన్ నుంచి పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జీపులో, స్కూటీ మీద స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా పార్టీ పథకాలను ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి సబితా మాట్లాడుతూ.. వరంగల్‌లో వచ్చే నెల15వ తేదీన 10 లక్షల మందితో నిర్వహించనున్న విజయగర్జన సభకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని, తాము కూడా బస్సులో వస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నింటా ముందుకు తీసుకెళ్తున్నారని, 30 సంవత్సరాల సమయం ఇచ్చినా ఎవరూ చేయలేని పనిని కేవలం మూడు సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త సోషల్‌మీడియాలో ఓ సైనికుడిలా ఉండాలని, ప్రభుత్వ పథకాలను దూకుడుగా ప్రచారం చేయాలన్నారు.
ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పెట్రోల్, డీజిల్‌పై రూ.43 ట్యాక్సు రూపంలో వసూలు చేస్తున్నారని దుష్పచారం చేశారని, మరీ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఎంత ట్యాక్సు తగ్గించారో చెప్పాలని సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేషన్, గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి కేసీఆర్ 50 శాతం మహిళలకు రిజర్వేషన్‌లు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ శాఖ చైర్మన్లుశ్రీధర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బడంగ్పేట్మేయర్చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్పేట్మేయర్దుర్గాదీప్ లాల్చౌహాన్, డిప్యూటీ మేయర్తీగల విక్రమ్ రెడ్డి, టీఆర్ఎస్ యువ నేత కౌశిక్‌రెడ్డి, మార్కెట్ చైర్ పర్సన్ వరలక్ష్మి, సీనియర్ నాయకులు కొత్త మనోహర్‌రెడ్డి, అధ్యక్షులు రాంరెడ్డి, కామేష్‌రెడ్డి, జి. కృష్ణారెడ్డి, బేర బాలకిషన్, కొండల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.