ద్వారకా తిరుమలలో ఘరానా మోసం.. రూ.3 కోట్లకు టోకరా

by srinivas |
huge fraud
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వ్యాపారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. అమాయక ప్రజల అవసరాలను గ్రహించి, గోల్డ్ స్కీమ్, చిట్టీల పేరుతో ఏకంగా రూ. 3 కోట్లు కాజేశాడు. తర్వాత సరిగా స్పందించకపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వ్యాపారిపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాపారి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story