- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందీలో ‘విక్రమ్ వేద’
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్.. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీ మూవీ స్టోరీస్‌పై కాన్సంట్రేట్ చేస్తోంది. తెలుగులో విజయవంతమైన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ మూవీని ఒరిజినల్ డైరెక్టర్‌తోనే రీమేక్ చేసి సక్సెస్ సాధించారు. నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ మూవీని కూడా రీమేక్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్..తమిళ్‌లో సూపర్ హిట్ అయిన గ్యాంగ్‌స్టర్ డ్రామాని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో నటించబోయే ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ వీరే అంటూ వార్తలు కూడా వస్తున్నాయి.
గాయత్రి-పుష్కర్ డైరెక్షన్‌లో 2017లో వచ్చిన సినిమా ‘విక్రమ్ వేద’. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజై సూపర్ డూపర్ సక్సెస్ అయింది. పోలీస్ ఆఫీసర్‌గా హీరో మాధవన్, నెగెటివ్ రోల్‌లో రౌడీగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తమ యాక్టింగ్ స్కిల్స్ చూపించి మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ హిందీ రీమేక్‌లో అమీర్‌ఖాన్, సైఫ్ అలీఖాన్ నటిస్తారని, ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన గాయత్రి-పుష్కరే దీన్ని తెరకెక్కిస్తారని న్యూస్ చక్కర్లు కొట్టాయి. తాజాగా అమీర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి విత్‌డ్రా అయ్యారని, మరో స్టార్ హీరో..గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ జాయిన్ అయ్యారని అంటున్నారు. ఈ యాక్షన్ డ్రామా ఎంటర్‌టైనర్‌లో రౌడీ షేడ్స్ ఉన్న వేద క్యారెక్టర్‌లో హృతిక్, పోలీస్ ఆఫీసర్ విక్రమ్ క్యారెక్టర్‌లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తారని చెబుతున్నారు. కాగా, ఈ స్టార్ హీరోల నుంచి కానీ ప్రొడక్షన్ హౌజెస్ నుంచి కానీ ఎలాంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.