- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైట్ మేనేజర్‌గా హృతిక్.. నియమించనున్న గూఢచారి సంస్థ
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బ్రిటిష్ స్పై డ్రామా సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ ఇండియన్ వెర్షన్‌లో నటించనున్నారు. చాలా కాలం తర్వాత సుస్మితా సేన్ నటించిన ‘ఆర్య’ సిరీస్‌కు దర్శకత్వం వహించిన సందీప్ మోడీ..ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ఏప్రిల్‌లో ముంబైలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ స్టార్ట్ కానుండగా..కొవిడ్ నిబంధనలు సడలించగానే ఇంటర్నేషనల్ లొకేషన్స్‌లో చిత్రీకరణ ప్రారంభించనున్నారు.
సుసానె బియర్ దర్శకత్వం వహించిన ‘ది నైట్ మేనేజర్’ సిరీస్ 2016లో రిలీజ్ కాగా, టామ్ హిడిల్‌స్టన్ ప్లే చేసిన జోనాథన్ పైన్ పాత్రను ఇండియన్ వెర్షన్‌లో చేయనున్నారు హృతిక్. ఒలివియా కోల్మన్, హ్యూ లారీ, ఎలిజబెత్ డెబికి, టామ్ హోలాండర్ కీలకపాత్రల్లో కనిపించిన సిరీస్ పలు గోల్డెన్ గ్లోబ్స్, బాఫ్టా, ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డులను గెలుచుకుంది. ఇక కథ విషయానికి వస్తే ఓ లగ్జరీ హోటల్ నైట్ మేనేజర్‌గా మాజీ సైనికుడిని నియమిస్తుంది ప్రభుత్వ గూఢాచార సంస్థ. ఆయుధ వ్యాపారి రహస్యాలు, దేశానికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలు, కుతంత్రాల గురించి తెలుసుకునేందుకు, తన సామ్రాజ్యంలోకి చొరబడేందుకు ఫార్మర్ సోల్జర్‌ను నియమిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.