రెడ్ చిల్లీస్‌లో క్రిష్ 4?

by Shyam |   ( Updated:2020-07-08 06:32:09.0  )
రెడ్ చిల్లీస్‌లో క్రిష్ 4?
X

ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరోగా క్రెడిట్ దక్కించుకున్న బాలీవుడ్ స్టార్.. హృతిక్ రోషన్. 2006లో వచ్చిన క్రిష్ సినిమాతో సూపర్ హీరో అయిపోయిన హృతిక్.. 2003లో వచ్చిన కోయి మిల్ గయా సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసిన విషయం తెలిసిందే. ఇందులో ఏలియన్ ఫ్రెండ్ జాదూతో క్రిష్ తండ్రి రోహిత్‌కు ఉన్న అనుబంధాన్ని చూపించారు. రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలతో పాటు క్రిష్ 2, క్రిష్ 3 కూడా సక్సెస్ కాగా, ప్రస్తుతం ‘క్రిష్ 4’ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాపై రాకేష్ రోషన్.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయగా, రాజేష్ రోషన్ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద పని చేస్తున్నారని టాక్. కాగా ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ బాధ్యతలను షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది.

క్రిష్ 4 స్టోరీని పకడ్బందీగా రాసుకున్న రాకేష్ రోషన్.. ఈ సినిమాలో జాదూను వెనక్కి తీసుకురానున్నారట. క్రిష్ తండ్రి రోహిత్ ఒక్కడే జాదూతో అనుబంధాన్ని కలిగి ఉండగా.. సినిమా స్టోరీలో రోహిత్, క్రిష్, జాదూలు ఉంటారని సమాచారం. కాగా త్వరలోనే నటీనటుల వివరాలు కూడా వెల్లడించనున్నారు.

Advertisement

Next Story