టేస్టీ మసాలా గుడ్డు పులుసు

by Hamsa |   ( Updated:2021-02-14 02:32:24.0  )
టేస్టీ మసాలా గుడ్డు పులుసు
X

కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన గుడ్లు -6
ఉల్లిపాయలు -3
అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్
వేరు శెనగపప్పు -పావు కప్పు
నువ్వులు -పావు కప్పు
ఎండు కొబ్బరి పొడి -పావు కప్పు
మెంతులు -పావు టీ స్పూన్
ధనియాలు -1 టీస్పూన్
జీలకర్ర -అర టీస్పూన్
పసుపు -అర టీస్పూన్
కారం -1 టేబుల్ స్పూన్
ఉప్పు -రుచికి తగినంత
నూనె -సరిపడా
నీళ్లు -రెండు కప్పులు
కొత్తిమీర -2 కట్టలు
చింత పండు రసం -ఒక కప్పు

తయారీ విధానం:

ముందుగా ఒక పాన్‌లో వేరు శెనగపప్పు, మెంతులు వేసి సన్నని మంటపై వేయించుకోవాలి. దానిలో ధనియాలు, జీలకర్ర వేసి ఓ నిమిషం వేగించుకోవాలి. తర్వాత నువ్వులు వేసి చిటచిటలాడించాలి. చివరగా కొబ్బరిపొడి వేసి దించేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేడి చేసి పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేపుకోవాలి. ఈ రెండింటినీ మిక్సీ పట్టుకోవాలి. అదే మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, చింత పండు రసం వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.

ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్న నూనెలో కోడి గుడ్లకు గాట్లు పెట్టించి హై ఫ్లేం మీద ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి. నూనె పైకి తేలాక నీళ్ళు పోసి హై ఫ్లేం మీద మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ ఉడికిన తర్వాత గుడ్లు వేసి సన్నని మంటపై 15 నిమిషాల పాటు ఉడికించుకుని దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లుకుంటే గుడ్డు మసాలా పులుసు రెడీ

Advertisement

Next Story