హలీమ్..నీ రుచికి సలామ్..ఇంట్లోనే హలీమ్ చేసుకోండిలా..!

by Anukaran |   ( Updated:2021-04-22 01:44:55.0  )
హలీమ్..నీ రుచికి సలామ్..ఇంట్లోనే హలీమ్ చేసుకోండిలా..!
X

దిశ, వెబ్ డెస్క్ : ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసం మొదలైంది. ముస్లింలు తినే హలీమ్ అంటే అందరికి ఇష్టమే.. కానీ ఈ కరోనా కాలంలో అవుట్ సైడ్ ఫుడ్ తినాలంటే భయపడాల్సిన పరిస్థితి. అందుకే ఇంట్లోనే హలీమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

కావాల్సినవి:

500 గ్రాముల బోన్‌లెస్‌ మటన్‌, అరకప్పు నెయ్యి, ఒక టీ స్పూన్‌ జీలకర్ర, ఒక టీ స్పూన్‌ తోక మిరియాలు, మీడియం సైజు దాల్చిన చెక్క ఒకటి, మూడు లవంగాలు, ఒక టీ స్పూన్ సాజిరా, మూడు యాలకులు, పెద్ద ఉల్లిపాయలు మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్ల, గరం మసాల ఒక టీ స్పూన్‌, నాలుగు పచ్చిమిర్చిలు, 200గ్రాముల పెరుగు, పసుపు ఒక టీ స్పూను, గోధుమ రవ్వ ఒకటిన్నర కప్పు, ఒక టీ స్పూన్‌ శనగపప్పు, ఒక టీ స్పూన్‌ పెసరపప్పు, ఒక టీ స్పూన్‌ ఎర్ర పప్పు(మసూరి పప్పు), మీడియం సైజు కట్ట కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ ఒకటి, చిన్న ముక్క అల్లం, నీళ్లు 12 కప్పులు, ఉప్పు తగినంత, కొద్దిగా జీడిపలుకులు.

తయారీ విధానం:

Step-1: ముందుగా గోధుమరవ్వ, శనగపప్పు, పెసరపప్పు, ఎర్ర పప్పులను విడివిడిగా కడిగి నానబెట్టాలి (కనీసం రెండు గంటలు). తరువాత శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి మటన్‌ను తీసుకుని దానిలో గరం మసాల, కొద్దిగా ఉప్పు, పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్రెజర్‌ కుక్కర్‌ ను స్టవ్‌ మీద పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న మటన్‌ మిశ్రమాన్ని దానిలో వేయాలి. నెయ్యిలో ఐదు నిమిషాలపాటు మటన్‌ వేగిన తరువాత దానిలో రెండు కప్పులు నీళ్లుపోయాలి. తరువాత కుక్కర్‌ మూత పెట్టి పది విజిల్స్‌ వచ్చేంతవరకు ఉడికించాలి.

Step-2: ఉడికిన మటన్‌ ను చల్లారనిచ్చి తరువాత మిక్సీలో మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నాన పెట్టుకున్న అన్ని రకాల పప్పులను ఒక గిన్నెలో వేసి ఉడికించాలి. ఇవి ఉడుకుతుండగానే పచ్చిమిరపకాయలు, లవంగాలు, కొత్తిమీర, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క,సాజిరా, తోక మిరియాలు వేసి దానిలో పది కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తరువాత వీటన్నింటిని మిక్సీలో వేసి ప్యూరీలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగిన ఎర్రగా వచ్చేంతవరకు వేయించి పక్కన ఉంచుకోవాలి.

Step-3: ఇప్పుడు మరో పాన్‌ స్టవ్‌ మీద పెట్టుకుని దానిలో మూడు స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తరువాత దానిలో ఉడికించి మెత్తగా రుబ్బి పెట్టుకున్న మటన్‌ను వేసి రెండు–మూడు నిమిషాలపాటు వేగనివ్వాలి. తరువాత గ్రైండ్‌ చేసిన ప్యూరీని (గోధుమ రవ్వ, పప్పులన్నింటిని) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి పైకి నెయ్యి తేలినప్పుడు దానిలో నిమ్మరసం, ఎర్రగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కలిపితే హలీమ్‌ తయారైనట్లే. స్టవ్‌ ఆపేసి పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు పలుకులను పైన వేస్తే చాలు.. ఘుమఘుమలాడే హలీమ్ రెడీ. మీరు ట్రై చెయ్యండి.

Advertisement

Next Story

Most Viewed