కీళ్ల నొప్పులు తగ్గాలంటే..!

by sudharani |
కీళ్ల నొప్పులు తగ్గాలంటే..!
X

సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువ మంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. కీళ్లు ఎర్రగా వాచిపోయి తీవ్రమైన నొప్పితో జీవితం నరకం ప్రాయమవుతోంది. మోకాళ్లు, పాదాలు, తుంటి, మోచేయి, భుజాలు ఇలా తదితర భాగాల్లో కీళ్ల నొప్పులు వస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలో చూద్దాం..

కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అన్ని రకాల పండ్లు, క్యారెట్‌, బీట్రూట్‌, కాప్సికం, బీన్స్‌, చిక్కుడు లాంటి కూరగాయల సలాడ్లు, కూరలు లేదా సూప్‌ రూపంలో రోజూ తీసుకోవాలి. క్యాబేజి, కాలీఫ్లవర్‌, బ్రొకొలి, ముల్లంగి లాంటివి అధికంగా తీసుకోవాలి. ఇక అరటి పండులో పొటాషియం సమృద్ధిగా ఉండడంతో ఎముకల సాంద్రతను పెంచుతోంది. దీనిలో ఉండే మెగ్నిషీయం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తోంది. ఆరెంజ్ పండ్లను రోజూ తీసుకుంటే వీటిలో ఉండే విటమిన్ సి కీళ్ల నొప్పుల సమస్యను పోగొడుతోంది.

ఇక చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే వాపులను తగ్గిస్తాయి. కీళ్లను దృఢంగా చేస్తాయి. చేపలను వారంలో కనీసం మూడు సార్లు అయినా తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చి రొయ్యలు తింటే ఇంకా మంచిది. వీటిని కూరగా చేసుకుని తినవచ్చు. దీనిలో విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉండంతో కీళ్ల నొప్పులను పోగొడుతుంది.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా ఉండడంతో నొప్పులు, వాపులను తగ్గిస్తోంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ సెప్టిక్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఒక గ్లాస్‌ పాలలో అర టీస్పూన్‌ పసుపు వేసుకుని తాగినా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే రాగులు, జొన్నలు, సజ్జలు రోజూ తినడంతో శరీరానికి కావాల్సిన కీలక పోషకాలు లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ప్రతిరోజూ సరైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Advertisement

Next Story