ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

by  |
ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం మెసెంజింగ్ యాప్స్‌లో స్టిక్కర్స్ యూసేజ్ పెరుగుతోంది. ప్రధానంగా యూత్ వీటికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. తాము చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాలన్నా, ఏదైనా తిట్టాలనుకున్నా లేదా అవతలి వ్యక్తికి సమాధానంగా మనం ఏదైనా ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వాలనుకున్నా.. వాటన్నింటినీ స్టిక్కర్లు ఈజీగా కన్వే చేయడంతో డిమాండ్ పెరిగింది. ఇక పండగ రోజులు, స్పెషల్ డేస్‌‌లో వీటి యూసేజ్ పీక్స్‌లో ఉంటుంది. రేపు ఫ్రెండ్‌షిప్ డే.. మరి స్నేహితులకు ‘ఫ్రెండ్‌షిప్ డే థీమ్డ్ స్టిక్కర్స్’ సెండ్ చేయాలంటే ఎలా?

వాట్సాప్, టెలిగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో భిన్న రకాల స్టిక్కర్స్‌ను బంధువులకు, స్నేహితులకు గ్రూపుల్లో సెండ్ చేస్తుంటాం. అదే ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్ పంపించాలంటే ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

వాట్సాప్..

1. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘ఫ్రెండ్‌షిప్ డే వాట్సాప్ స్టిక్కర్స్’ అని సెర్చ్ చేయాలి
2. ఆ లిస్టులోంచి ఏ స్టిక్కర్ ప్యాక్‌నైనా మనం డౌన్‌లోడ్ చేసి వాడుకోవచ్చు.
3. డౌన్‌లోడ్ చేశాక.. వాటిని వాట్సాప్‌కు యాడ్ చేసుకోవాలి. స్టిక్కర్స్‌ను యాడ్ చేసుకునేందుకు వాట్సాప్‌లో ప్రత్యేక ఆప్షన్ ఉంది.
4. యాడ్ చేసుకోగానే.. అవి వాట్సాప్‌లోని స్టిక్కర్స్ సెక్షన్స్‌లో కనిపిస్తాయి. అంతే ఇష్టమైన స్టిక్కర్‌ను ఎంచుకుని బడ్డీస్‌కు సెండ్ చేయడమే.
ఇవి కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే. యాప్ స్టోర్‌‌లో ఈ స్టిక్కర్లు అందుబాటులో లేవు.

టెలిగ్రామ్ అండ్ హైక్

1. లెఫ్ట్ బాటమ్ కార్నర్‌లో ‘స్టిక్కర్’ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి.
2. ఇప్పుడు + ఐకాన్ మీద క్లిక్ చేసి.. స్పెసిఫిక్ థీమ్ స్టిక్కర్స్ సెర్చ్ చేయాలి.
ఉదా.. ఫ్రెండ్‌షిప్ డే అని టైప్ చేయగానే స్టిక్కర్స్ వస్తాయి. వాటిలో సెలెక్ట్ చేసుకోవాలి.
3. వాటిని స్టిక్కర్ కరోసెల్‌లో యాడ్ చేసుకోవాలి. అంతే వాటిని ఫ్రెండ్స్‌కు సెండ్ చేసుకోవచ్చు.
అదే హైక్‌లో అయితే వాటిని చాట్‌లో యాడ్ చేసుకోవాలి.


Next Story