నోరూరించే బోటీ పులుసు..!

by Shyam |
నోరూరించే బోటీ పులుసు..!
X

కొంతమంది నాన్ వెజ్ ఇష్టంగా తింటారు. అందులో బోటీ అంటే ఎక్కువగా ఇష్టపడతారు. బోటితో డిఫరెంట్ రెసిపీస్ తయారు చేయవచ్చు. వీటిలో బోటి బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు :

బోటీ ముక్కలు – 2 కప్పులు, ఉల్లిపాయలు -2, టొమాటోలు -2, బెండకాయలు – 8, చింతపండు పులుసు – ఒక కప్పు, నూనె – మూడు టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు – 1 టీస్పూన్‌, పసుపు – 1/4 టీస్పూన్‌, కారం – 1 టీస్పూన్‌, ధనియాలపొడి – 1 టీస్పూన్‌, గరం మసాలా -1/4 టీస్పూన్‌, బియ్యప్పిండి – 2 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు -2 రెబ్బలు, కొత్తిమీర – ఒక కట్ట, ఉప్పు – తగినంత

తయారీ విధానం:

ముందుగా బోటిని వేడినీళ్లతో శుభ్రంగా కడిగి, దానిలో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఐదు కప్పుల వాటర్ వేసి కుక్కర్ లో నాలుగు విజిల్స్ వచ్చేవరక ఉడికించుకోవాలి. మరోవైపు ఒక మందపాటి గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, పెద్దగా కట్ చేసిన బెండకాయ ముక్కలు, చింతపండు పులుసు, కరివేపాకు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.

ఈ మిశ్రమం సగం ఉడికిన తర్వాత ఉడికించుకున్న బోటీ ముక్కలు వేయాలి. దీనిలో గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి మరో కొద్దిసేపు ఉడికించాలి. చివరగా అరకప్పు నీళ్లలో బియ్యప్పిండి వేసి మరుగుతున్న చారులో వేసి ఉండలు కట్టకుండా కలపాలి. సన్నని మంటలపై రెండు నిమిషాలు ఉడికించి చిక్కబడిన తర్వాత దించేసుకుంటే వేడివేడి బోటీ పులుసు రెడీ..

Advertisement

Next Story

Most Viewed