- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీల బెడద.. శరీరానికి నష్టం కలిగిస్తున్న ఫేక్ ప్రొడక్ట్స్
దిశ, ఫీచర్స్ : ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఫిట్‌గా ఉండేందుకు డైట్ సప్లిమెంట్స్(ఆహార మందులు) వాడుతున్నారు. ఈ మేరకు మార్కెట్‌లో అనేక రకాల సప్లిమెంట్స్ లభిస్తుండగా. అందులో చాలా వరకు ఫేక్ మందులు చెలామణి అవుతున్నాయి. నిషేధిత స్టెరాయిడ్స్, హానికర రసాయనాలు, ఇతరత్రా నకిలీ పదార్థాలతో తయారయ్యే ఈ తరహా మందులు రంగు, ఆకృతిలో అచ్చం ఒరిజినల్ మందుల లాగే కనిపిస్తుంటాయి.
కానీ శరీరానికి చెప్పలేనంత నష్టాన్ని కలిగిస్తాయి. ఇక దశాబ్ద కాలంగా డైటరీ సప్లిమెంట్స్ విషయంలో భారత్ కొరత ఎదుర్కొంటుండగా.. దిగుమతులకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో జెన్యూన్ అండ్ ఫేక్ సప్లిమెంట్స్ రెండు కూడా మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాయి. అయితే ఫేక్ సప్లిమెంట్స్ పనితీరుపై తయారీదారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల మార్కెట్‌లో సులభంగా ఎంటర్ అయ్యేందుకు అవకాశమిస్తోంది. అలాంటప్పుడు అసలు, నకిలీకి మధ్య తేడాలను ఎలా గుర్తించాలి?
పైన తెలిపిన అంశాల దృష్ట్యా.. అసలు, నకిలీ సప్లిమెంట్స్ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం ఆవశ్యకం కాగా, ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని..
బార్‌కోడ్ : ప్రస్తుతం చాలా వరకు స్మార్ట్‌ఫోన్లు బార్‌కోడ్స్‌తో పాటు క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేయగలిగే యాప్స్, ఫీచర్స్ కలిగి ఉంటున్నాయి. ఈ ఫెసిలిటీ ఆధారాంగా ప్రొడక్ట్ పైనున్న ఒరిజినల్ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే వెబ్‌సైట్‌కు యాక్సెస్ అవుతారు. అక్కడ బ్రాండ్ వివరాలతో పాటు దాని ప్రామాణికతకు సంబంధించిన సమాచారం కూడా లభిస్తుంది. ఈ మేరకు ఉత్పత్తి ప్రామాణికతను ఖచ్చితంగా తెలుసుకునేందుకు బార్‌కోడ్ పర్ఫెక్ట్‌గా ఉపయోగపడుతుంది.
ప్యాకేజింగ్ అండ్ సీల్ : ఫేక్ కంపెనీలు.. ఒరిజినల్ కంపెనీల లోగోలకు దగ్గరగా ఉండేలా, తీక్షణంగా చూస్తే తప్ప గుర్తించలేని విధంగా స్పెల్లింగ్స్, ఫాంట్స్‌లో మార్పులు చేస్తుంటాయి. అంతేకాకుండా న్యూట్రిషన్‌కు సంబంధించిన సమాచారంలోనూ తప్పులు గమనించవచ్చు. ఇక వినియోగదారులు ప్రొడక్ట్ కొనుగోలు చేసినపుడు సీల్ బ్రేక్ చేసినట్లుగా ఉంటే తిరిగిచ్చేయాలి. ఎందుకంటే నాసిరకం సదుపాయాలు గల కంపెనీల నుంచి వచ్చే ఉత్పత్తులకు నాణ్యతతో కూడిన సీల్స్ ఉండవనే విషయం గుర్తుంచుకోవాలి.
ప్యాకేజింగ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అప్రూవల్ : సదరు ఉత్పత్తికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అప్రూవల్ ఉందా? అని తెలుసుకోవడం ముఖ్యం. వినియోగదారుల ఆరోగ్యం విషయంలో ఉత్పత్తి నాణ్యతను పరీక్షించే బాధ్యత ఈ సంస్థకే ఉంటుంది. అయితే సప్లిమెంట్స్ మీ వద్దకు చేరుకునే ముందు కఠినమైన పరీక్షలతో పాటు మల్టిపుల్ క్వాలిటీ చెకింగ్స్ ఉంటాయని గమనించాలి.
హాలోగ్రామ్ : అసలు, నకిలీ ఉత్పత్తుల మధ్య తేడాను గుర్తించేందుకు ఉత్తమ మార్గం సదరు బ్రాండ్ హాలోగ్రామ్‌ను చెక్ చేయడం. వాస్తవానికి హాలోగ్రామ్‌ను తయారు చేసి, డిస్‌ప్లే చేసుకునేందుకు ప్రతీ సంస్థకు సరైన సాంకేతికత ఉండదు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తుల ప్రామాణికతకు చిహ్నంగా హాలోగ్రామ్‌లను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే.
ఎంఆర్‌పీ స్టిక్కర్ : సాధారణంగా ఫేక్ సప్లిమెంట్స్ కంపెనీలు ఎంఆర్‌పీ స్టిక్కర్‌ను ప్యాకింగ్‌పై అంటిస్తుంటాయి. కానీ ఒరిజినల్ సప్లిమెంట్స్‌కు మాత్రం హాలోగ్రామ్‌తో పాటు ఎంఆర్‌పీ ట్యాగ్ ఉంటుంది. నకిలీ ఉత్పత్తులకు ఈ ఫెసిలిటీ ఉండదు కనుక ఎంఆర్‌పీ ట్యాగ్, హాలోగ్రామ్ కాంబినేషన్ ఉందంటే అది ఒరిజినల్ ఉత్పత్తి అని అర్థం.
నీటిలో కరిగించి పరీక్షించడం : మీరు కొనుగోలు చేసిన సప్లిమెంట్‌ను ఒక స్పూన్ పరిమాణంలో నీటిలో వేసి గది ఉష్ణోగ్రత వద్ద కొన్ని సెకండ్ల పాటు కలపాలి. అది ఫేక్ అయితే పౌడర్ రూపంలో గ్లాస్‌కు అంటుకుంటుంది. ఒరిజినల్ అయితే పూర్తిగా కరిగిపోతుంది. చూసేందుకు చాలా చిన్న పరీక్షే అయినా, సమర్థవంతమైన ఫలితాలను ఇస్తుంది. నిజానికి ఒరిజినల్ సప్లిమెంట్స్ చాలా మృదువుగా ఉంటుండగా.. ఫేక్ సప్లిమెంట్స్ గాఢమైన వాసన, చెడు రుచిని కలిగి ఉంటాయి.
ఫేమస్ అవుట్‌లెట్స్ నుంచే కొనుగోలు : ఈ తరహా సప్లిమెంట్స్‌ను ప్రముఖ అవుట్‌లెట్స్, రిటైల్ స్టోర్స్ లేదా ఇంటర్నెట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే పేరొందిన రిటైలర్స్ అయితే ఎప్పుడూ నాణ్యత గల ఉత్పత్తులను విక్రయించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
కాగా, ఫిట్నెస్‌పై శ్రద్ధ పెట్టాలనుకునేవారు.. ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించి తమ ఆహార నియమావళిలో పర్టిక్యులర్ సప్లిమెంట్‌ను వాడొచ్చా లేదా అనే విషయాన్ని నిర్దారించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ తర్వాత వాడబోయే సప్లిమెంట్స్‌లోని పదార్థాలపైనా అవగాహన పెంచుకోవచ్చు. అంతేకాదు కెమికల్స్, స్టెరాయిడ్స్ తీవ్రతను తెలుసుకోగలగడం.. అసలు, నకిలీ ఆహార మందుల మధ్య తేడాలను గుర్తించేందుకు సాయపడుతుంది. ఫైనల్‌గా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రఖ్యాత బ్రాండ్లకు చెందిన నిజమైన డీలర్ల నుంచే సప్లిమెంట్లను కొనాలి.