సరికొత్తగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్స్

by Harish |
సరికొత్తగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. వ్యూ ప్రొఫైల్స్‌ను కొత్తగా అప్‌డేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇలాంటి ఆప్షనే ఉంటుంది. కాగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రొఫైల్ పిన్, డిస్‌ప్లే పిక్చర్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుండగా.. అమెజాన్‌లో అలాంటి ఆప్షన్ లేదు. ప్రైమ్ వ్యూ ప్రొఫైల్స్‌ను మార్చి నెలలోనే ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ, అది కూడా కొంతమందికి మాత్రమే. కాగా, గత వారమే గ్లోబల్‌గా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది అమెజాన్. ఇప్పటివరకున్న ప్రొఫైల్ లిమిట్‌ను పెంచుతూ ఆరుగురు యూజర్లకు అనుమతినిచ్చింది. అమెజాన్. వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఫైర్ టీవీ, ప్లే స్టేషన్ ఇలా అన్నీ ప్లాట్‌ఫామ్‌లపైనా అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్, ఐఓస్ యాప్ :

– అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ ఓపెన్ చేసి.. బాటమ్ బార్‌లో ఉన్న ‘మై స్టఫ్’ను సెలెక్ట్ చేసుకోవాలి.
– యువర్ ప్రొఫైల్‌పై ట్యాప్ చేయాలి.. ఇప్పుడు ‘+’ ఐకాన్ మీద క్లిక్ చేసి, న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.

ఆండ్రాయిడ్ టీవీ, ఫైర్ టీవీ :

– టీవీలో ప్రైమ్ వీడియో యాప్ ఓపెన్ చేసి.. డ్రాప్ డౌన్ మెనూ నుంచి ప్రొఫైల్ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి.. ఇప్పుడు ‘+’ ఐకాన్ మీద క్లిక్ చేసి, న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.

అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు ప్రొపైల్స్‌ను ఎడిట్ చేసుకోవడంతో పాటు రిమూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక్క అకౌంట్‌పై గరిష్టంగా ఆరు ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతి ప్రొఫైల్‌కు తమదైన పర్సనల్ కంటెంట్, రికమెండేషన్స్, వాచ్ హిస్టరీ, సీజన్ ప్రొగ్రెస్, వాచ్ లిస్ట్ ఉంటాయి. కిడ్స్ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకునే సదుపాయం ఉంది. 12 సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉన్నవాళ్లు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కిడ్స్ ప్రొఫైల్స్ వల్ల.. వారికి సంబంధించిన కంటెంట్ సజెషన్ అందుబాటులో ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed