- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Instagram: ఇన్‌స్టా గైడ్ – కొవిడ్-19 ముఖ్య సమాచారం
దిశ, ఫీచర్స్: దేశవ్యాప్తంగా ప్రజలు తమకు లేదా తమ ప్రియమైనవారికి ప్రస్తుతం మందులు, ఆక్సిజన్, హాస్పిటల్ పడకలు, ఇతర వనరుల కోసం తెగ వెతుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి సహాయపడే వాలిడ్ ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉంటే, దాన్ని ఇతరులతో షేర్ చేసుకోవడానికి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక గైడ్‌ను క్రియేట్ చేయొచ్చు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
లాక్‌డౌన్ అమలు చేస్తున్నా, విదేశీయుల రాకపై ఆంక్షలు విధిస్తున్నా.. కొవిడ్ -19 వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే కరోనా బాధితులు లేదా కరోనా సోకిన తమ బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, ఇతరుల కోసం ఇంజెక్షన్లు, ప్లాస్మా దాతలు, ఆక్సిజన్ సిలిండర్లు, చికిత్స కోసం విరాళాలు అందించే వారికోసం ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి రిక్వెస్ట్‌లతో పాటు, అవి అందించే వ్యక్తుల పోస్ట్(ధ్రువీకరించిన లీడ్)లను కూడా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు సంధానకర్తగా ఆ సమాచారాన్ని షేర్ చేస్తే ఎంతోమందికి సాయం చేసినవాళ్లవుతారు. ఈ నేపథ్యంలోనే ధ్రువీకరించిన లీడ్స్‌ను ఇతరులతో పంచుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘గైడ్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ గైడ్‌లోని సమాచారాన్ని మీ ప్రొఫైల్‌లో పోస్ట్ చేయగానే ఇతరులు వాటిని వీలైనంతగా చూడొచ్చు. వాటిని ఇతరులతో వీలైన త్వరగా పంచుకోవచ్చు. అయితే ఈ గైడ్ క్రియేట్ చేసేముందు మీరు పంచుకుంటున్న సమాచారానికి విశ్వసనీయత ఉందా? అది సరైనా సమాచారమేనా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. కోల్డ్ లీడ్స్(అనవసరమైనవి), ఫోన్ నంబర్‌లను ప్రస్తుతం డజన్ల మంది పంచుకుంటున్నారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కోల్డ్ కాల్స్, సమాచారం పంచుకోవడం కరెక్ట్ కాదు.
గైడ్ క్రియేషన్ :
ప్రైవేట్ ప్రొఫైల్ అయితే ఫాలోవర్స్ మాత్రమే చూడగలుగుతారు. అలా కాకుండా పబ్లిక్ ప్రొఫైల్ ఆప్షన్ ద్వారా అందరూ చూడటంతో పాటు, షేర్ చేసే సదుపాయం ఉంటుంది.
* న్యూ వెర్షన్ ఇన్‌స్టా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. లేదా అప్‌డేట్ చేయండి.
* ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు లాగిన్ అవ్వండి. మీ ప్రొఫైల్ పేజీ టాప్ రైట్‌లో ఉన్న [+] ఐకాన్ క్లిక్ చేయాలి. అప్పుడు జాబితాలోని “గైడ్” పై నొక్కండి.
* అప్పుడు మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ‘గైడ్ టైప్’ కోసం మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.
స్థలాలు – మీ నగరంలో , లేదా వెలుపల ఉన్న ప్రదేశాలను సిఫార్సు చేయొచ్చు
ఉత్పత్తులు – మీకు ఇష్టమైన ఉత్పత్తులను సిఫార్సు చేయాలి
పోస్ట్‌లు – మీరు సృష్టించిన లేదా సేవ్ చేసిన పోస్ట్‌లను సిఫార్సు చేయండి
ఉదాహరణకు, మీకు తెలిసిన ఆస్పత్రులు, ఖాళీగా ఉన్న పడకలు, ఆక్సిజన్ / మందులతో కూడిన దుకాణాలు, ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్ చేయగల ప్రదేశాలు మొదలైనవి అన్ని ‘స్థలాలు’ కింద లిస్ట్ అవుట్ కనిపిస్తాయి. కొవిడ్ -19 వనరులపై ధ్రువీకరించిన లీడ్‌లతో ఉన్న ఇతర ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల పోస్టులను ‘పోస్ట్’ల కింద జాబితా చేయవచ్చు, ఇందులో మీరు చేసిన పోస్ట్‌లు కూడా ఉంటాయి.
*మీరు సృష్టించాలనుకుంటున్న గైడ్ రకాన్ని ఎంచుకుని పోస్ట్ చేయండి,
* గైడ్ కోసం టైటిల్ జోడించిన తర్వాత, కవర్ ఫోటోను ఎంచుకోవచ్చు.
* స్క్రీన్ టాప్ రైట్ కార్నర్ నుంచి “నెక్స్ట్” పై క్లిక్ చేసి “షేర్” నొక్కండి.