- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొబైల్‌లో PF బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి.. విత్ ఔట్ ఇంటర్నెట్..!
దిశ, వెబ్‌డెస్క్ : ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్(PF) బ్యాలెన్స్‌ను వారి ఇళ్లలో నుంచే చెక్ చేసుకోవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2020-21 కోసం PF డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును ఆమోదించింది. ‘2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 8.5% వడ్డీని EPFO ఖాతాలు ఉన్న 25 కోట్ల మందికి క్రెడిట్ చేయడానికి ఉత్తర్వులు జారీ వెలువడ్డాయి. అయితే, EPF ఖాతా ఉన్న ఉద్యోగి ఇంటర్నెట్ అవసరం లేకుండా వారి ఫోన్‌లో EPF ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకోవచ్చు. EPFO ఆన్‌లైన్ ఇ-సేవా పోర్టల్‌ను కలిగి ఉన్నప్పటికీ ఇందులో కొన్ని సార్లు ఇంటర్ నెట్ సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకోసమే ఇటువంటి సమస్యలు ఎదురైనా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ‘ఆఫ్‌లైన్’ సేవను అందుబాటులో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో కొన్ని నియమాలను పొందుపరిచారు. అవేంటంటే..
SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా EPF, PF బ్యాలెన్స్‌ను ఎలా చెక్ చేసుకోవచ్చు.
SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్‌ని ఎలా తనిఖీ చేయాలి.
EPFOలో ఖాతా కలిగి ఉన్న ఉద్యోగులు వారి ఫోన్‌లో కింది నెంబర్‌లను డయల్ చేయడం ద్వారా వారి PF బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు- 7738299899 మరియు 011-22901406.
EPF సభ్యులు SMS ద్వారా బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. వారు చేయాల్సిందల్లా ‘EPFOHO UAN LAN’ అని టైప్ చేసి, వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కి పంపండి.
రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలా చేయడానికి EPF సభ్యుడు 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.
ఒకవేళ మీరు సాంప్రదాయ పద్ధతిని అనుసరించకూడదనుకుంటే, మీరు దీన్ని ఆన్‌లైన్‌లో కూడా తనిఖీ చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా EPFO పోర్టల్‌లో UNA, PASSWORD ఎంటర్ చేసి చూసుకోవచ్చు. లేదా passbook.epfindia.gov.in ఈ లింక్‌పై క్లిక్ చేసి అందులో వచ్చే స్టెప్స్‌ను ఫాలో అవుతూ కూడా చెక్ చేసుకోవచ్చు.