- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మైక్రో సెలబ్రిటీ’ కావాలా.. అయితే యూట్యూబ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
దిశ, ఫీచర్స్ : ఆన్‌లైన్‌లో వీడియో కంటెంట్‌ను షేర్ చేయడానికి అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫామ్‌గా యూట్యూబ్ మారింది. ప్రజలు తమ సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి, కొంత అదనపు డబ్బు సంపాదించడానికి, తమను లేదా తమ వ్యాపారాన్ని ప్రోత్సహించుకోవడానికి అదో అద్భుతమైన వేదిక. అంతేకాదు ‘మైక్రో సెలబ్రిటీ’గా మారడానికి కూడా ఇది గొప్ప మార్గం. అయితే అదృష్టవశాత్తూ, ప్రజలు చూడటానికి ఇష్టపడే కంటెంట్‌ను ఉత్పత్తి చేయడానికి అంతగా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. కానీ వీడియోల క్వాలిటీ కోసం సరైన పరికరాలు మాత్రం అవసరం. సరైన టూల్స్‌తో నాణ్యమైన వీడియో కంటెంట్‌ని ఇచ్చినప్పుడే, చానెల్‌కు ఆదరణ దక్కడంతో పాటు ఈజీగా ఫేమస్ కావచ్చు. కానీ సమస్య ఏమిటంటే మనలో చాలామందికి ఎలాంటి పరికరాలు ఉపయోగించాలో, ఎలా క్వాలిటీ వీడియోలను రూపొందించాలో తెలియదు. వాటికి సంబంధించిన విషయాలపై ఓ లుక్ వేద్దాం.
స్మార్ట్‌ఫోన్, ఈమెయిల్ ఐడీ ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చానల్ ప్రారంభిచొచ్చు. దాంతో పుట్టగొడుగుల్లా చానల్స్ సంఖ్య పెరిగిపోగా, పోటీ కూడా అదేస్థాయిలో ఉంది. ఈ క్రమంలో కొంతమంది యూట్యూబర్లు తమ వీడియోలను రూపొందించడానికి విస్తృతమైన అధునాతన వీడియో ప్రొడక్షన్ పరికరాలను (కొందరు ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్‌లు, కెమెరా ఆపరేటర్లను కూడా తీసుకుంటారు) వాడుతున్నారు. అంత పెద్దస్థాయిలో వెళ్లవలసిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్‌తో తీసినా, అందులో కూడా బ్యాలెన్సింగ్ వీడియో ఎలా తీయాలి. పోటీలో నిలబడ్డానికి, మనం అందించే ఉత్తమ కంటెంట్‌ను వీక్షకులకు చేరవేయడానికి, సబ్‌స్క్రైబర్స్ మన్ననలు అందుకోవడానికి అవసరమైన బేసిక్ వీడియో ప్రొడక్షన్ ఎక్విప్‌మెంట్ జాబితాలో ‘మైక్రోఫోన్, ట్రైపాడ్/గింబాల్ స్టెబిలైజర్, లైటింగ్ ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.
గింబాల్ :
స్మార్ట్‌ఫోన్‌తో తీసినప్పుడు మొబైల్ షేక్ కావడంతో, వీడియోల్లో కదలికలు వస్తుంటాయి. దీంతో వీడియో క్వాలిటీ లోపిస్తుంది. అస్థిరమైన ఫుటేజ్ అనేది ప్రొఫెషనల్ వీడియో ప్రొడక్షన్‌కు ఇబ్బందికరం. ఇది వీక్షకులను డిస్ట్రక్ట్ చేస్తుంది ఆ కదలికలు లేకుండా వీడియో స్థిరంగా రావడానికి ‘గింబాల్’ లేదా ట్రైపాడ్‌లను ఉపయోగించవచ్చు. మీరు ఎంత స్థిరంగా కెమెరాను పట్టుకోవడానికి ప్రయత్నించినా, హ్యాండ్‌హెల్డ్ షూటింగ్ అస్థిరమైన వీడియోలను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల కెమెరాను జాగ్రత్తగా సమతుల్యం చేయడానికి 3-యాక్సిస్ గింబల్స్ ఉత్తమ ఎంపిక. ఎందుకంటే కెమెరా టిల్ట్ స్మార్ట్‌ఫోన్ పైకి కిందికి కదలికను నియంత్రిస్తుంది, పక్క నుంచి పక్కకి మూవ్ కాకుండా పాన్ నిరోధిస్తుంది. ముందుకు వెనుకకు జరగకుండా నిశ్చలంగా ఉండేలా ‘రోల్’ ఉపయోగపడుతుంది. ఇలా వీడియో రికార్డ్ చేస్తున్న క్రమంలో అన్నివైపులా నుంచి గింబల్ రికార్డ్ చేస్తున్న ఫుటేజీని స్థిరీకరించగలదు. దీనివల్ల షాట్‌లు స్థిరంగా, సినిమాటిక్‌గా వస్తాయి. జాయ్‌స్టిక్ కంట్రోల్స్, టైమ్-లాప్స్, హైపర్-లాప్స్ మోడ్‌లతో సహా సబ్జెక్ట్ ట్రాకింగ్ వంటి అనేక ఇతర ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ గింబల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. మంచి కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్ ఉంటే, నాణ్యతను పెంచడానికి స్మార్ట్‌ఫోన్ గింబల్ మీకు సహాయం చేస్తుంది.
ట్రైపాడ్స్ :
కెమెరా సెటప్ బరువును బట్టి వాటిలో చాలా రకాలుంటాయి. ఏదేమైనా దృఢమైన ట్రైపాడ్‌పై పెట్టుబడి పెట్టడం ఉత్తమం. స్టేషనరీ షాట్‌లను షూట్ చేయడానికి ఇది అవసరం కాగా సన్నివేశాన్ని కచ్చితంగా సెటప్ చేయడానికి, టైమ్ లాప్స్ షాట్‌లను తీసుకోవడానికి వీటిని ఉపయోగించవచ్చు.
ఎక్స్‌టర్నల్ మైక్రోఫోన్ :
ఆడియో నాణ్యత వీడియోకు చాలా ప్లస్ పాయింట్. అధిక-నాణ్యత వీడియో 4K ఫుటేజ్‌ని రికార్డ్ చేసినప్పటికీ, ఆడియో భయంకరంగా ఉంటే వీక్షకులు దాన్ని చూడలేకపోతారు. అంతర్నిర్మిత ల్యాప్‌టాప్ లేదా కెమెరా మైక్రోఫోన్‌లు సాధారణంగా బ్యాడ్ ఆడియో క్వాలిటీని కలిగి ఉంటాయి. ఎందుకంటే అవి పరిసర శబ్దాలను సమర్థవంతంగా రికార్డ్ చేయలేవు లేదా తొలగించలేవు. కాబట్టి యూట్యూబ్ వీడియోలను రూపొందించడానికి మరో ముఖ్యమైన సాధనం మంచి మైక్రోఫోన్.
లాపెల్ మైక్స్
వీటినే ‘లావలియర్’ మైక్రోఫోన్‌లు అని కూడా పిలుస్తారు. ఇవి పోర్టబుల్, కాంపాక్ట్, వైర్డ్ మైక్రోఫోన్స్ కాగా ఫిల్మ్ మేకింగ్, బ్రాడ్‌కాస్టింగ్‌లో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఈ మైక్‌లు సంభాషణలను రికార్డ్ చేయడానికి అనువైనవి. వీటిని హ్యాండిల్ చేయడం కూడా చాలా సులభం. బట్టలు లేదా బెల్ట్‌పై దీన్ని క్లిప్ చేయవచ్చు. ఇది ట్రాన్స్‌మిటర్‌ను కలిగి ఉండగా, దీనికి లాపెల్ కనెక్ట్ చేస్తారు. ఇక దీని రిసీవర్ చాలా దూరంలో ఉన్న ట్రాన్స్‌మిటర్ నుంచి సిగ్నల్‌ను పొందగలదు.
షాట్‌గన్ :
షాట్‌గన్ మైక్రోఫోన్‌లు సాధారణ కార్డియోయిడ్ మైక్రోఫోన్ కంటే ఎక్కువ దిశాత్మకమైనవి. మైక్రోఫోన్ వద్ద వచ్చే అన్‌వాంటెడ్ శబ్దాలను అవి తిరస్కరిచండంతో పాటు స్పష్టమైన ధ్వనిని రికార్డ్ చేస్తాయి. షాట్‌గన్ మైక్‌లను దూరం నుండి ధ్వనిని సంగ్రహించడానికి ఉపయోగిస్తారు. షాట్‌గన్ మైక్రోఫోన్‌లు ప్రొఫెషనల్ కెమెరాతో వీడియో రికార్డింగ్ కోసం వినియోగిస్తారు. ఆరుబయట రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆడియోను డిస్టర్బ్ చేసే పరిసర శబ్దాలను తీసుకోదు.
లైటింగ్ :
అన్‌ఈవెన్ లైటింగ్ కండిషన్‌లలో గొప్ప నాణ్యత ఫుటేజీని సంగ్రహించడానికి ‘కృత్రిమ లైటింగ్’ తప్పనిసరి. ప్రధానంగా ఇంటి లోపల, మసకబారిన ప్రదేశాల్లో రికార్డింగ్ చేస్తుంటే లైటింగ్ పరికరాలు అవసరం. తగినంత పరిసర కాంతి ఉన్న చోట మీరు షూటింగ్ చేస్తున్నప్పటికీ, లైటింగ్ పరికరాలు మరింత వీడియోకు బ్రైట్‌నెస్ తీసుకువస్తాయి.
సాఫ్ట్‌బాక్స్ :
సహజమైన, మృదువైన లైటింగ్‌ను ఇది అందిస్తుంది. ఒక దృశ్యంలో నీడలను రాకుండా లైటింగ్‌ను జోడించాలనుకుంటే ఈ రకమైన లైటింగ్ గేర్ అనువైనది.
అంబ్రెల్లా లైట్ :
మృదువైన లైటింగ్ అవసరమయ్యే వీడియో మేకర్స్ కోసం అంబ్రెల్లా లైట్లు చవకైన, పోర్టబుల్ పరిష్కారం. సాఫ్ట్‌బాక్స్‌తో పోలిస్తే, అంబ్రెల్లా.. సిల్వర్ ఇంటిరీయర్ లేయర్ నుంచి కాంతి ప్రతిబింబిస్తుంది కాబట్టి గొడుగులు మరింత నియంత్రిత లైటింగ్‌ను సృష్టిస్తాయి. దీనికి విస్తరించే షీట్ లేదు, కానీ ఇది విస్తారమైన స్థలాన్ని కవర్ చేయగలదు. బ్యాక్‌డ్రాప్‌లు, ఆన్-లొకేషన్ షూట్‌లకు ఇవి అనువైనవి.
రింగ్ లైట్లు :
వ్లాగర్స్ ఇవి ఉపయోగకరమైనవి. రింగ్ నుంచి.. ఒక సబ్జెక్ట్ చుట్టూ కాంతిని ప్రసరింపజేసినప్పుడు, అది ప్రతి దిశ నుంచి వచ్చే నీడలను తొలగిస్తుంది. అంతేకాదు కెమెరా ముందు ఎవరైనా మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఈ రకమైన లైటింగ్ పరికరాలు తరచుగా బ్యూటీ, మేకప్ వ్లాగర్స్ ఎక్కువగా వినియోగిస్తారు. ముఖాన్ని కాంతివంతంగా చూపిస్తూనే, మచ్చలను హైలైట్ చేసే నీడలను తొలగిస్తాయి. అంతేకాదు కాంతి తక్కువగా ఉన్నప్పుడు రాత్రిపూట బహిరంగ పరిస్థితులలో షూటింగ్ చేసేందుకు అధిక బడ్జెట్ లైటింగ్ పరికరాలను ఏర్పాటు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రత్యామ్నాయంగా దీన్ని వినియోగించుకోవచ్చు.
ఆన్-కెమెరా లైట్లు
ఇవి నిరంతర లైటింగ్‌ను అందిస్తాయి. వీటిని కెమెరాలలో అమర్చవచ్చు. పెళ్లి వీడియోలు, డాక్యుమెంటరీ, మసకబారిన ప్రదేశాలు వంటి వీడియో కంటెంట్‌లు రికార్డ్ చేయడానికి ఇవి చాలా బాగుంటాయి.
స్మార్ట్‌ఫోన్‌కు మించి :
ఒకవేళ స్మార్ట్‌ఫోన్ కాకుండా కెమెరా ఉపయోగించాలనుకుంటే.. యూట్యూబ్ వీడియోల కోసం అత్యంత ఖరీదైన డీఎస్‌ఎల్‌ఆర్‌ను కొనుగోలు చేయనవసరం లేదు. అధిక-నాణ్యత (కనీసం 1080p) వీడియోను రికార్డ్ చేయగల ఏ కెమెరానైనా ఉపయోగించవచ్చు. యూట్యూబ్ కొత్తగా ప్రారంభించినట్లయితే.. క్వాలిటీతో కూడిన క్యామ్‌కార్డర్లు లేదా వెబ్‌క్యామ్‌లు సరిపోతాయి. చానల్ స్థాయి పెరిగినా లేదా మొదటి నుంచి హైక్వాలిటీ ఎక్విప్‌ఎమెంట్‌పై పెట్టుబడి ఆలోచన ఉన్నా లేదా అప్‌గ్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు డీఎస్‌ఎల్‌ఆర్, మిర్రర్‌లెస్ కెమెరాలు మంచి ఆప్షన్ అని గుర్తుంచుకోండి. ఇక కొనుగోలు చేయాల్సిన కెమెరా రకం మీరు సృష్టించాలనుకుంటున్న యూట్యూబ్ కంటెంట్ రకాన్ని బట్టి ఉంటుంది.
క్యామ్‌కార్డర్లు :
వీడియోలను రికార్డ్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన సాధనం ఇది కాగా కంటెంట్‌ను సృష్టించడానికి ఇది గుడ్ చాయిస్. అంతేకాకుండా, ఆధునిక క్యామ్‌కార్డర్లు తేలికైనవి, చాలా సరసమైన ధరల్లో దొరుకుతాయి. ఇంట్లో ఒక వీడియోను చిత్రీకరించినప్పుడు లేదా ఆన్-ది-గో వ్లాగింగ్ కోసం వాటిని ఉపయోగించవచ్చు. అంతేకాదు మీరు వీడియోలను వివిధ ప్రదేశాలలో/పరిస్థితులలో షూట్ చేయాలనుకుంటే, ఈ క్యామ్ మీ సమయాన్ని ఆదా చేస్తుంది.
వెబ్ క్యామ్స్ :
ప్లగ్-అండ్-ప్లే వీడియో కెమెరా కావాలనుకునే వారికి, ప్రత్యేకించి గేమింగ్ యూట్యూబర్స్ కోసం.. గేమ్ రికార్డ్ చేయాల్సిన వారికి వెబ్‌క్యామ్‌లు ఉత్తమ ఎంపిక. వెబ్‌క్యామ్‌లు లైవ్ స్ట్రీమింగ్‌ను సులభతరం చేస్తాయి, ఎందుకంటే అవి కంప్యూటర్‌కు నేరుగా కనెక్ట్ చేయొచ్చు. ట్యుటోరియల్ వీడియోలను తయారు చేసేవారికి కూడా వెబ్‌క్యామ్ పోర్టబుల్ ఉత్తమ చాయిస్‌గా చెప్పొచ్చు.
యాక్షన్ కెమెరాలు :
మోస్ట్ కాంపాక్ట్, వెర్సటైల్ టైప్ కెమెరాలు ఇవి. ట్రావెల్ వ్లాగర్స్‌కు బెస్ట్ ఆప్షన్. పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, వాటిలో చాలా వరకు సాధ్యమైనంత ఎక్కువ నాణ్యత గల వీడియోలను ఉత్పత్తి చేయగలవు, అందుకే చాలా మంది యూట్యూబర్‌లు వారు అందించే వీడియో నాణ్యత, మన్నిక కోసం యాక్షన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
మిర్రర్‌లెస్ కెమెరా :
డీఎస్‌ఎల్‌ఆర్‌లాగా షూట్ చేయగల సామర్థ్యం కారణంతో పాటు తేలికైనవి, చిన్న పరిమాణమైనవి కావడంతో వీడియో క్రియేటర్‌లు, ఫోటోగ్రాఫర్‌లకు మిర్రర్‌లెస్ కెమెరాలు ది బెస్ట్ కెమెరాలుగా మారాయి. ఇంట్లో వీడియోలను రికార్డ్ చేయడానికి వీటిని ఉపయోగించగలిగినప్పటికీ, వాకింగ్ లేదా చుట్టూ తిరుగుతున్నప్పుడు వ్లాగింగ్ కోసం ఇవి చాలా బాగుంటాయి.
DSLR
వీటి అధిక-నాణ్యత ఫలితాల కారణంగా యూట్యూబర్లు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారు. తక్కువ కాంతి పరిస్థితుల్లోనూ క్వాలిటీ వీడియో, మెరుగైన వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉండటం వల్ల యూట్యూబ్ కంటెంట్‌ను రూపొందించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.