- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ ఎంత అవసరమో తెలుసా..?
న్యూఢిల్లీ: మాయదారి మహమ్మారి కరోనా రెండో దశకు దేశమంతా చిగురుటాకులా వణుకుతున్నది. తొలిదశలో మరణాల విషయంలో అంతగా ప్రభావం చూపకున్నా రెండో దశలో మాత్రం అది పంజా విసరుతున్నది. లక్షణాలేవీ చూపించకుండానే బాడీలోకి ప్రవేశించి మెల్లిగా ఊపిరితిత్తులను దెబ్బతీసి మనిషి ఆయువు తీస్తున్న మహమ్మారికి బలై గడిచిన రెండు నెలలుగా దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. కొవిడ్ సోకి వ్యాధి తీవ్రమైన తర్వాత సదరు రోగికి ఊపిరి ఆడకపోవడంతో ఆ పేషెంట్‌కు ఆయువు (ప్రాణం) పోయడానికి డాక్టర్లు ప్రాణవాయువు (మెడికల్ ఆక్సిజన్) ను అందిస్తున్నారు. అసలు కొవిడ్-19 సోకినవారికి మెడికల్ ఆక్సిజన్ అవసరమా..? దాని అవసరాన్ని ఎప్పుడు గుర్తించాలి..? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎంత కావాలి..?
సాధారణంగా ఒక అడల్ట్ పర్సన్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఏడు నుంచి ఎనిమిది లీటర్ల గాలిని పీల్చి వదులుతాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి రోజుకు సుమారు 11 వేల లీటర్ల గాలి అవసరం. అయితే ఇందులో ఉచ్ఛ్వాశ (ఇన్‌హేల్) లో 21 శాతం, నిశ్వాస (ఎక్స్హేల్)లో 15 శాతం ఆక్సిజన్ ఉంటుంది. ఈ శాతాల్లో కొరత ఏర్పడినప్పుడు మాత్రమే బాడీలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. ఆ సమయంలో మనిషికి బయటనుంచి ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. కాగా, కొవిడ్ సోకిన పేషెంట్లలో వ్యాధి తీవ్రతను బట్టి ఆక్సిజన్ స్థాయి మారుతూ ఉంటుంది. వైరస్ ఊపిరితిత్తుల మీద దాడి చేసినప్పుడు ఆక్సిజన్ పీల్చుకునే సామర్థ్యం తగ్గుతుంది.
ఎలా గుర్తించాలి..?
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు చెబుతున్న దాని ప్రకారం శరీరంలో ఆక్సిజన్ స్థాయి (పల్స్ రేట్) 90 శాతం కంటే తక్కువగా ఉంటేనే మెడికల్ ఆక్సిజన్ సప్లిమెంట్ అవసరమని చెబుతున్నారు. కొవిడ్ వచ్చిన వ్యక్తి ఆరు నిమిషాల నడక ద్వారా దీనిని గుర్తించవచ్చునని చెబుతున్నారు. నడక ప్రారంభించినప్పుడు ఆక్సిజన్ స్థాయి చూసుకుని.. ఆరు నిమిషాల తర్వాత మరోసారి చెక్ చేసుకువాలని, ఆ సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే అదే మొదటి ప్రమాద హెచ్చిరిక (ఫస్ట్ వార్నింగ్ సైన్) అని చెబుతున్నారు. అప్పుడు వైద్యున్ని సంప్రదించడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు.
కరోనా పేషెంట్‌కు ఎంత ఆక్సిజన్ కావాలి..?
ఒక కొవిడ్-19 పాజిటివ్ వ్యక్తికి ఎంత ఆక్సిజన్ అవసరం అన్నది వ్యక్తిని బట్టి ఉంటుంది. కొంతమందికి నిమిషానికి ఒక లీటర్ ఆక్సిజన్ అవసరం పడగా.. మరికొంతమందికి మూడు నుంచి నాలుగు లీటర్ల దాకా అవసరం పడొచ్చు. ఈ సమయంలో వైద్యులు హై ఫ్లో నాజల్ క్యా్న్సులా ద్వారా ఆ వ్యక్తికి ఆక్సిజన్ అందిస్తారు. ఇలా అందిస్తే నిమిషానికి 60 లీటర్లు, గంటకు 3,600 లీటర్లు, రోజుకు 86 వేల లీటర్ల ఆక్సిజన్ అవసరం పడుతుంది. అయితే హై ఫ్లో నాజల్ క్యా్న్సులా ద్వారా ఆక్సిజన్ అందిస్తే ఒక ఆక్సిజన్ సిలిండర్ నాలుగు గంటలు మాత్రమే వస్తుంది.
ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సరిపోతుందా..?
ఒక ఆక్సిజన్ సిలిండర్ నాలుగు గంటలు మాత్రమే వస్తుండటంతో వాటి రీఫిల్లింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఇదే సమయంలో పలువురు ఇంటివద్దే ఆక్సిజన్ సిలిండర్లను గానీ, కాన్సంట్రేటర్లను గానీ కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చుట్టుపక్కల పరిసరాల నుంచి ఆక్సిజన్ తీసుకుని శుద్ధి చేసి బాడీకి మెరుగైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. అయితే నిమిషానికి 3 లీటర్ల ఆక్సిజన్ అవసరమైన వాళ్లు మాత్రమే కాన్సంట్రేటర్లు వాడాలని, అప్పటికీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే వెంటనే ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా రోగులలో 93 శాతం కంటే తక్కువ పల్స్ నమోదై ఆక్సిజన్ అవసరం ఉన్నవాళ్లు పది శాతం కన్నా తక్కువే ఉండటం గమనార్హం.