- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. కొత్తగా నమోదైన కేసులెన్నంటే.!
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులపై వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 91,594 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,672 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,37,122కి పెరిగాయి. అయితే గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 504 కొత్త కేసులు నమోదుకాగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 2,467 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,98,966కి పెరిగింది. అలాగే నిన్న ఒక్కరోజు 18 మంది కరోనా బారినపడి మరణించగా ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 13,115కి పెరిగింది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story