- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పక్షుల్లోనూ విడాకులు.. ఆ సామర్థ్యం తగ్గినందుకే..!
దిశ, ఫీచర్స్ : గ్లోబల్ వార్మింగ్, ఆల్బట్రాస్ జాతి పక్షుల జీవనశైలి మధ్య సంబంధాన్ని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా జీవితాంతం ఒకే పార్ట్‌నర్‌తో మేటింగ్ చేసే ఈ బర్డ్స్‌లో ఇటీవల ‘విడాకుల రేటు’ పెరిగినట్లు రీసెర్చర్స్ గుర్తించారు. తగినంత ఆహారం లభించకపోవడంతో పాటు మేత కోసం అన్వేషించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు వాటిపై ఒత్తిడి కలిగిస్తున్నాయని, ఈ పరిస్థితులే పక్షుల జంటలు విడిపోయేందుకు కారణమవుతున్నాయని అంచనా వేశారు.
ఆల్బట్రాస్‌ల లవ్ లైఫ్‌పై గ్లోబల్ వార్మింగ్‌తో పాటు సముద్ర ఉష్ణోగ్రతలు ప్రభావం చూపిస్తున్నాయని లిస్బన్ యూనివర్సిటీ బయాలజిస్ట్ ఫ్రాన్సిస్కో వెంచురా నేతృత్వంలో పనిచేస్తున్న పరిశోధకులు తెలిపారు. అర్జెంటీనాకు ఆగ్నేయంగా దక్షిణ అట్లాంటిక్‌లోని ద్వీపసమూహమైన ఫాక్‌లాండ్ దీవుల్లో 15,500 బ్లాక్-బ్రౌడ్ ఆల్బట్రాస్‌లపై ఈ అధ్యయనం ఫోకస్ చేసింది. పరిశోధకులు 2003 నుంచి ‘క్యాప్చర్-మార్క్-రీక్యాప్చర్’ డేటాను సేకరించారు. ఐదు ఉప-కాలనీలకు చెందిన పక్షులను సంతానోత్పత్తి సమయంలో బంధించి వాటికి గూళ్లు కట్టడంతో పాటు ప్రతీ కొత్త గుడ్డును, పుట్టిన పిల్లల వివరాలను రికార్డ్ చేశారు. సముద్ర ఉష్ణోగ్రత, నివాస పరిసరాలు, పోషకాల సరఫరా వంటి పర్యావరణ అంశాలను కూడా విశ్లేషించారు.
సముద్రం వెచ్చగా ఉన్న సంవత్సరాల్లో ఆల్బట్రాస్‌లలో విడాకుల రేటు ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఉదాహరణకు 2017లో నీటి ఉష్ణోగ్రత గత 17 ఏళ్ల కంటే రికార్డు స్థాయిలో అత్యంత వెచ్చగా ఉన్నప్పుడు విడాకుల రేటు 7.7%గా ఉంటే సాధారణ పరిస్థితుల్లో మాత్రం విడాకుల రేటు సగటున 3.7%గా ఉంటుంది. వాతావరణ పరిస్థిత్లుల్లో హెచ్చుతగ్గులు, మార్పుల కారణంగా ఆల్బాట్రాస్ జంటలు సంతానోత్పత్తిలో విఫలమయ్యాయి. ఆరోగ్యం క్షీణించి లేదా మేత కోసం ప్రయాణించే క్రమంలో కలిగిన ఒత్తిడే ఇందుకు కారణమవుతున్నాయి. దీంతో కష్టతరమైన సంతానోత్పత్తి కాలంలో పక్షులు విడిపోతున్నాయని పరిశోధకులు వివరించారు. ఈ మేరకు ప్రత్యేకించి ఫిమేల్ బర్డ్స్ చొరవతో కొత్త జంటలు ఏర్పడుతున్నాయని తెలిపారు.