- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాపిల్.. ఇమ్యూనిటీ సిస్టమ్‌ను పెంచుతుందా?
దిశ, వెబ్‌డెస్క్ :
‘రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదు’ అన్నది చాలా పాత కొటేషన్. కానీ.. మరోసారి అదే కొటేషన్‌ను చెప్పుకోక తప్పదు. ప్రపంచంలోనే అత్యంత ‘న్యూట్రిషియస్ ఫ్రూట్’గా యాపిల్ పేరు పొందిందంటేనే.. అందులో శరీరానికి కావాల్సిన ఎన్ని రకాల పోషకాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. యాపిల్ శరీరానికి అవసరమయ్యే న్యూట్రిషన్స్ అందివ్వడంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్‌ను కూడా బూస్ట్‌అప్ చేస్తుంది. లైఫ్ స్టైల్ డిసీజ్, వైరస్ అటాక్‌ల నుంచి శరీరం తట్టుకునేందుకు అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్, హెల్తీ ఫైబర్స్ , నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్‌ను కూడా అందిస్తుంది.
కొవిడ్-19 భయంతో అందరూ ఇమ్యూనిటీ పెంపొందించుకోవడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కరోనా భయంతో అనే కాదు.. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటే.. సీజనల్ వ్యాధులు, ఇతర అనారోగ్యాలు, వైరస్ అటాక్‌ల నుంచి కూడా శరీరాన్ని కాపాడుకోవచ్చు. స్వతహాగా మన శరీరంలో నేచురల్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్నా.. దానికి అవసరమైన శక్తిని బయట నుంచి కూడా అందించడం చాలా అవసరం. యాపిల్‌లో ఉండే ఫైటోకెమికల్ యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇంప్రూవ్ డైజేషన్ :
యాపిల్స్‌లో ఉండే ‘పెక్టిన్’ అనే సాల్యుబుల్ ఫైబర్.. ‘ఇన్‌ఫ్లమేషన్’ వంటి ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్‌ను తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలో సాల్యుబుల్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఇమ్యూన్ సిస్టమ్‌పై ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు ల్యాబ్ యానిమల్స్‌పై అధ్యయనం చేశారు. కొన్ని రోజుల పాటు ఫ్యాట్ డైట్‌తో పాటు సాల్యుబుల్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్‌ను జంతువులకు ఫీడ్ చేశారు. కాగా, సాల్యుబుల్ ఫైబర్ తిన్న యానిమల్స్.. మిగతా వాటి కన్నా చాలా వేగంగా కోలుకోవడంతో పాటు వాటి ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరిగిందని ఆ అధ్యయనంలో తేలింది. ఆ తర్వాత ఇదే ప్రయోగం మనుషులపై చేయగా.. సేమ్ రిజల్స్ట్ వచ్చాయని పరిశోధకులు వెల్లడించారు.
మెటబాలిజం :
ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్‌అప్ అయ్యేందుకు ప్రధానంగా విటమిన్ ‘సి’ అవసరం. కాగా, రా యాపిల్స్‌లో విటమిన్ – సి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు మెటాబాలిజాన్ని పెంచేందుకు అవసరమైన హై ఫైబర్ కూడా యాపిల్ ఉండటం విశేషం.
ఎందుకు తినాలంటే? :
అన్ని రకాల ఫలాల్లో కంటే యాపిల్‌లోనే పోషకాలు ఎక్కువని, వీటితో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ తినడం వల్ల తలనొప్పి, బీపీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని.. ముఖ్యంగా న్యుమోనియా వ్యాధి రాకుండా నివారించగలదని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. గ్రీన్ యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. కాలేయాన్ని రక్షించడంతో పాటు అలసటను దూరం చేయగలవని పరిశోధనల్లో తేలింది. చేతులు వణకడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు సైతం.. గ్రీన్ యాపిల్‌తో చెక్ పెట్టవచ్చు. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మధుమేహం ఉన్న వారి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్‌ను నివారించడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.