- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హౌస్‌ను ఆర్డర్‌లో పెట్టాల్సిన అవసరం ఉంది’
న్యూఢిల్లీ: ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ నేతలంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. హౌస్(పార్టీ)ని ఆర్డర్‌లో పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్య్లూసీ) సమావేశాన్ని సోమవారం వర్చువల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… ‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మనం ఓటమి పాలయ్యాం. ఈ ఓటమిపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ ఫలితాలు చూస్తుంటే పార్టీ సరైన పంథాలో నడవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తోంది.
ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలపై మనం సమీక్షించుకోవాలి. ఓటమికి గల కారణాలు.. ఆశించిన స్థాయిలో పనితీరును పార్టీ ఎందుకు కనబరచలేదో ఆయా రాష్ట్రాల నాయకులు స్పష్టంగా తెలిపాలి. ఈ వైఫల్యాలపై సమీక్షించేందుకు గాను ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ గ్రూపు త్వరలోనే తమ నివేదికను అందిస్తుంది. ఈ ఫలితాలు కనువిప్పు కలిగించాయి. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ముందుకు వెళదాం’అని సూచించారు. ఇక పార్టీ అధ్యక్ష ఎన్నికలు జూన్‌లో జరగాల్సి ఉందనీ… వీటి నిర్వాహణ బాధ్యతను సీనియర్ నాయకులకు అప్పజెప్పుతున్నట్టు తెలిపారు.