- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే వారం హాస్టళ్లు రీ ఓపెన్
దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్సిటీల పరిధిలోని హాస్టళ్లను వచ్చే వారం నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కొవిడ్ నిబంధనలను అమలు చేస్తూ హాస్టళ్లను రీ ఓపెన్ చేయనున్నారు. యూనివర్సిటీల్లో తొలిరోజు ఫిజికల్ తరగతుల నిర్వహణ అంశంపై బుధవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్ని వర్సిటీల వీసీలతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, తరగతి గదుల్లో ఏర్పాట్ల అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా కళాశాలలకు హాజరవుతున్నారని వీసీలు సమాచారం అందించారు. వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో హాస్టళ్లను ప్రారంభిస్తే మరింత మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యే అవకాశాలున్నాయని సూచించారు. విద్యార్థుల సౌఖర్యార్థం వచ్చే వారం నుంచి హాస్టళ్లను ప్రారంభించాలని ఉన్నతవిద్యామండలి చైర్మన్ లింబాద్రి ఆదేశించారు. హాస్టళ్లలో, తరగతి గదుల్లో వంట రూముల్లో, భోజన గదుల్లో శానిటేషన్‌ను పక్కగా చేపట్టాలని ఆదేశించారు. అపరిశుభ్ర వాతావరణానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.