కొవిడ్ పేషెంట్‌పై అత్యాచారయత్నం..

by Sumithra |   ( Updated:2020-09-13 03:55:44.0  )
కొవిడ్ పేషెంట్‌పై అత్యాచారయత్నం..
X

దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు దుండగులు ఒంటరిగా అమ్మాయిలు కనిపిస్తే చాలు ఎంతటి అఘాయిత్యాలకైనా ఒడిగడుతున్నారు. చివరకు ఆరోగ్యం బాలేక ఆస్పత్రికి వెళ్లిన యువతిపై.. ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

కరోనా బారినపడి ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతిపై అదే ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న యువకుడు అత్యాచారయత్నం చేశాడు. పట్టుబడిన నిందితుడిని మందలించి.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడంపై బాధితులు మండిపడుతున్నారు. అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడాలని, నిందితుడిని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also…

45 రోజులకే భార్య వద్దంటూ భర్త సూసైడ్

Advertisement

Next Story