Hanuman: హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

by Prasanna |
Hanuman: హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలామంది హనుమంతుని (Hanuman ) పూజిస్తారు. ఆంజనేయులకు ఇష్టమైన రోజుల్లో మంగళవారం ఒకటి.. కాబట్టి, ఈ రోజు భక్తితో హనుమాన్ ను పూజించడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో కూడా హనుమంతుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే, హనుమంతుడికి ఇష్టమైన రాశులు కూడా ఉంటాయని మనలో చాలా మందికి తెలియదు. వారికీ ఎల్లప్పుడూ ఆ దేవుడి అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ముఖ్యంగా, ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా, వారి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్యలు అంటున్నారు.

మకర రాశి ( Makara Rasi )

హనుమంతుడి అనుగ్రహం వలన ఈ రాశి వారు ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అలాగే, ఇప్పుడున్న కుటుంబ సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా, వీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.

మేష రాశి ( Mesha Rasi)

ప్రతి మంగళవారం మేష రాశివారు హనుమంతుడిని పూజించడం వలన వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. అలాగే, జీవితంలో ఆనందాలు పొందుతారు. కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. పిల్లలు లేని వారికీ సంతానం కలుగుతుంది.

సింహ రాశి ( Simha Rasi )

సింహ రాశివారికి అధిపతి సూర్యుడు. ఈ రాశికి చెందిన వారిపై సూర్యుడు, హనుమాన్ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీటితో పాటు అద్భుతమైన శక్తిని పొందుతారు. కోర్టు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed